Bruce Lee Health Problems: మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ శారీరక లోపాలు మీకు తెలుసా....?
Bruce Lee : చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే వాళ్లకు బ్రూస్‌లీ జీవితం ఓ పాఠం. తనకున్న శారీరక మానసిక లోపాలను అధిగమించి ప్రపంచస్థాయి లెజండ్‌గా ఎదిగారు.
Bruce Lee: బ్రూస్ లీ. ఓ లెజండ్. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే 20 శతాబ్ధపు ప్రభావశీలురులో బ్రూస్ లీ ఒకరు. యుద్ధ కళ అయిన మార్షల్ ఆర్ట్స్‌లో బ్రూస్ లీ వేగం అసమాన్యం. శరీరాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఎలా వాడవచ్చు అన్న దానికి బ్రూస్ లీ ఓ ఉదాహరణ.
అన్నీ ఉంటే నేను ఇది చేయగలను అని మనం సాధారణంగా చెబుతాం. కానీ అవన్నీ లేనప్పుడు సాధించే వారే ప్రపంచానికి ఓ ఐకాన్‌గా మారతారు. అలాంటి వ్యక్తే బ్రూస్ లీ. ఆయనలో కొన్నిశారీరక లోపాలు ఉన్నాయి. కానీ అవేవి తన లక్ష్యాలను అడ్డుకోలేదు. తన శారీరక లోపాలను అధిగమించి ఇష్టపడి ఎంచుకున్న మార్షల్ ఆర్ట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచాడు.
బ్రూస లీ శారీరక లోపాలు ఇవే..
కంటి సమస్య
పోరాట కళల్లో విజయం సాధించాలంటే కంటి చూపు చాలా అవసరం. అందుకే సైన్యం సహా పోలీసు వంటి శాఖల్లో కంటి చూపు సరిగా లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయరు. ఎందుకంటే శత్రువును మట్టి కరిపించాలంటే ఇతరుల కన్నా కంటి చూపు చాలా షార్ప్‌గా ఉండాలి. అయితే మార్షల్ ఆర్ట్స్‌లో ఆరి తేరిన బ్రూస్ లీకి నియర్ సైట్ డెన్సెస్ ఉంది. దీన్నే మైయోపియా అని కూడా అంటారు.
ఈ కంటి సమస్య ఉన్న వాళ్లు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. దగ్గర వస్తువులను మాత్రమే స్పష్టంగా చూడగలరు. ఈ సమస్య అధిగమించాలంటే తప్పనిసరిగా లెన్స్ వాడాల్సి ఉంది. అయితే బ్రూస్ లీకి ఈ సమస్య ఉన్నా మార్షల్ ఆర్ట్స్‌లో ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. అందుకు కారణం అతని శిక్షణ, పోరాట నైపుణ్యమే కారణమని తెలుస్తోంది. చాలా వేగంగా స్పందించే అతని శరీరం కంటి సమస్యను అధిగమించింది. అందుకే బ్రూస్ లీ లెజండ్ అయ్యారు.
కాళ్లలో తేడాలు
బ్రూస్ లీ ఫైట్స్ చూస్తే తన కాళ్లను చాలా వేగంగా కదలిస్తాడు. అతని కిక్ పవర్ చాలా ఎక్కువ. ప్రపంచంలో మరే ఇతర మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కూడా బ్రూస్ లీ అంత వేగంగా , బ్రూస్ లీ అంత బలంగా లెక్ కిక్స్ ఇవ్వలేరని చెబుతారు. అలాంటిది ఆయన రెండు కాళ్లలో తేడా ఉన్నదంటే నమ్ముతారా. కాని ఇది నిజం.
వైద్యుల నివేదిక ప్రకారం బ్రూస్లీ రెండు కాళ్లలో తేడా ఉంది. కుడి కాలు కన్నా ఎడమ కాలు సైజు తక్కువ. అయితే చాలా మందికి కొద్ది తేడాలు ఉండటం సహజమే అయినా, బ్రూస్ లీకి మాత్రం ఎడమ కాలు , కుడి కాలు కన్నా ఒక ఇంచు తక్కువ ఉంటుంది. అంత తేడా ఉన్నా ఆయన తన కాళ్లను మారణాయుధంగా వాడే అంత శక్తి తన ప్రాక్టీస్ ద్వారా సాదించారు. తనకున్న శారీరక లోపం తన నైపుణ్యాన్ని అడ్డుకోలేకపోయందని చెబుతారు.
లివర్ సమస్య
మహా శక్తివంతుడిగా కీర్తి గడించిన బ్రూస్ లీకి 1973లో లివర్ సమస్య వచ్చింది. లివర్ ఎడిమాతో బాధపడేవాడు. దీని వల్ల శరీరం బాగా అలసి పోతుంది. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. ఇలాంటివి క్రీడాకారులకు, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడల్లో శారీరక బలం చాలా అవసరం. ఇలాంటి సమస్య ఉండే వారు పోరాడలేరు. కాని బ్రూస్ లీ ఈ సమస్యను అధిగమించి తన ప్రతిభను ప్రదర్శించే వాడు.
శారీరక పరిణామం
క్రీడల్లో, యుద్ద కళల్లో శరీర సౌష్టవం చాలా ముఖ్యమైనది. కాని బ్రూస్ లీ శరీర నిర్మాణం చిన్నది. 60 కిలోల బరువు ఉన్న బ్రూస్ లీ పోరాటంలో తన కన్నా భారీగా, బలం ఉన్నా వారిని అవలీలగా ఓడించే వాడు. అందుకు కారణం తన శరీర నిర్మాణానికి మించి శక్తిని పెంచకునే వాడు. అందు కోసం అతను చేసే వ్యాయమం, శిక్షణ కారణం. బాడీ మజిల్స్ పెంచే వ్యాయమం చేసే వాడు. కిక్, పంచ్ లలో వేగం కోసం నిత్యం కష్టపడేవాడు. ఇలా తన మజిల్ పవర్ క్రమంగా పెంచుకోవడం, ఇతరుల కన్నా వేగంగా కిక్ లు పంచ్ లు బలంగా ఇవ్వడం కారణంగా చిన్న శరీరం మార్షల్ ఆర్ట్స్ లెజండ్ అవడానికి ఆటంకం కాలేదు.
మానసిక ఒత్తిడి
బ్రూస్ లీ ఓ ఫైటర్ అయినా అందుకు తన శరీరమే ఆయుధమైన తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న వ్యక్తి. అయితే అది తన ప్రతిభకు, తన ఎదుగుదలకు ఆటంకం కాలేదు. హాంకాంగ్ నుంచి అమెరికాకు సినిమా అవకాశాల కోసం వచ్చినప్పుడు హాలీవుడ్ తొలుత తిరస్కరించింది. కాని బ్రూస్ లీ పట్టుదలతో ప్రయత్నాలు చేసి అదే హాలీవుడ్ నిర్మాతలు తనతో సినిమా చేసేందుకు క్యూలో ఉంచేలా చేయగలిగే రీతిలో బ్రూస్ లీ పరిస్థితులను మార్చుకున్న వైనం నిజంగా అబ్బురపరిచేదే. ఈ క్రమంలో ఆయన ఎంతో మానసిక ఒత్డిడిని ఎదుర్కొన్నట్లు ఆయన సన్నిహితులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు.
ఇలా శారీరకంగా మానసికంగా బ్రూస్ లీలో లోపాలు, సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటిని సాధన ద్వారా, తన నైపుణ్యం నిరంతంర పెంచుకోవడం ద్వారా అధిగమించి బ్రూస్ లీ 20 శతాబ్ధంలో అత్యంత ప్రభావశీలుడిగా నిలిచాడు. ఈ రోజుల్లో ప్రతీ చిన్న ఓటమికి, లేదా శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆత్మహత్యలు చేసుకునే వారికి బ్రూస్ లీ జీవితం ఓ పాఠం లాంటిది.
Also Read: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?