ఏ పని చేసినా మొబైల్ వాడుతూ ఉంటారు కొందరు. దీనివల్ల టాస్క్​లు పెండింగ్ కూడా పడిపోతూ ఉంటాయి.

అయితే మొబైల్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని రెగ్యూలర్ టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.

రోజులో ఏ సమయంలో సెల్ ఉపయోగించాలో తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఎంతసేపు వినియోగించాలనేది గోల్స్ సెట్ చేసుకోవాలి.

ఏ యాప్​ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దానికి టైమర్ పెట్టుకోండి. అలాగే ట్రాక్ చేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు.

వర్క్ చేస్తున్న సమయంలో అయినా మొబైల్ వినియోగాన్ని తగ్గించుకోండి. వర్క్​పై ఫోకస్ చేయండి.

భోజన సమయంలో, నిద్రపోయేప్పుడు మొబైల్​ని వినియోగించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

అవసరం లేని యాప్స్​ని డిలేట్ చేయడం లేదా అవసరం లేకుండా ఎక్కువగా వినియోగించే వాటిని కూడా అన్​ ఇన్​స్టాల్ చేసేయండి.

గేమ్స్ ఆడే అలవాటు ఉంటే.. వాటిని కంట్రోల్ చేసుకునేందుకు ఇతర అలవాట్లు చేసుకోండి.

మొబైల్ వినియోగించడం కంటే.. బుక్​ చదివితే రిలాక్స్ అవుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.