Viral News: డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
Britain: బ్రిటన్ లో ఓ చైనా జాతీయుడు సీరియల్ రేపిస్ట్ గా పోలీసులు నిర్దారించారు. డ్రగ్స్ ఇచ్చి మహిళల జీవితాల్ని నాశనం చేస్తున్నారని గుర్తించారు.

Britain worst rapist: బ్రిటన్‌లో చైనా జాతీయుడైన జెన్‌హావో జూ అనే వ్యక్తిని 10 మంది మహిళలకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసిన కేసులో దోషిగా అక్కడి కోర్టు తేల్చింది. అతను పది మందిని కాదు.. మొత్తం యాభై మంది మహిళల్ని ఇలా అత్యాచారం చేసినట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అతని ఇంట్లో సోదాలు చేసిన బ్రిటన్ అధికారులు.. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అతను సీరియర్ రేపిస్ట్‌గా గుర్తించారు.
చైనా జాతీయుడైన జెన్‌హావో జూ చైనాలో సంపన్న కుటుంబానికి చెందిన వాడు. యూనివర్శిటీ కాలేజ్ లండన్ (UCL)లో ఇంజనీరింగ్‌లో PhD చదువుతున్నఅతను చాలా హంబుల్ గా ప్రవర్తిస్డాడు. అందరితో చనువుగా ఉంటాడు. కానీ అది అతని పై రూపం.. లోపల క్యారెక్టర్ మాత్రం సీరియల్ రేపిస్ట్.
ఇరవై ఏళ్ల వయసులో లండన్ వచ్చిన జెన్‌హావో జూ మొదట బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేయడానికి ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లాడు. లండన్‌లో ఉన్న సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. ఆ సమయంలో యాప్ లను ఉపయోగించి అమాయక మహిళల్ని లోబర్చుకోవడం ప్రారంభఇంచాడు. నైట్ క్లబ్‌లకు వెళ్లి మంచి మాటలు చెప్పి అమ్మాయిల్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. డేట్ కు వెళదామని చెప్పి.. వారికి డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసేవాడు.
అయితే ఇతను రేప్ చేసే విధానం చాలా ఘోరంగా ఉంటుంది. మహిళలు డ్రగ్స్ తీసుకుని తెలివిలో లేని సమయంలో వారిపై అత్యాచారం చేస్తారు. వారిలో కదలిక లేకుండా తన పని తాను చేసుకోవడం తనకు ఎంతో బాగుంటుందని ఆ వ్యక్తి కోర్టుకు నిర్మోహమాటంగా చెప్పాడు. అందుకే అలాంటి వీడియోలు కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆడవారు స్పందించకుండా ఉంటే తనకు ఇష్టమని.. ఆ రకమైన లైంగికత్వం తనకు ఇష్టమని ఆ యువకుడు చెప్పాడు.
విచారణలో మొత్తం పది మంది మహిళలకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసినందుకు దోషిగా గుర్తించారు. బ్రిటన్ లో ఇప్పటి వరకూ బయటపడిన అత్యంత భయంకరమైన రేపిస్టులలో ఒకరిగా జెన్‌హావో జూ అక్కడి దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇతనికి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. డ్రగ్స్ కు బానిస కావడం.. విచిత్రమైన లైంగిక కోరికల కారణంగా ఈ అత్యాచారాలకు పాల్పడ్డాడు. జీవితాంతం జైల్లోనే ఉండవచ్చని బాయటకు రావడం కష్టమని బ్రిటన్ న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Crime News: గోవాలో ఘనంగా వివాహం, కానీ నెలల వ్యవధిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!





















