Covid-19: కరోనా మందులతో సైడ్‌ఎఫెక్ట్- బ్లూ కలర్‌లోకి మారిన చిన్నారి కళ్లు
Covid-19: థాయ్‌లాండ్‌లో COVID-19 సోకిన బాలుడికి ఫెవిపిరావిర్ ఔషధంతో చికిత్స అందించగా కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలం రంగులోకి మారిపోయాయి.
Covid-19: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్. గత నాలుగేళ్లుగా ప్రజలను ఇదో ఒకరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడ్డారు. కోట్ల మంది దీని దెబ్బకు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. నేటికి రూపాంతరాలు చెందుతూ వ్యాపిస్తూనే ఉంది. ఒమిక్రాన్, ఎరిస్ అంటూ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. దీని బారినపడి కోలుకున్న వారు నేటికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని రూపు మాపడానికి ప్రత్యేకమైన చికిత్స అంటూ లేకపోవడంతో ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
కోవిడ్ నివారణ, నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్లు వచ్చినా, వాటి వినియోగంతో సైడ్ ఎఫెక్టులను వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో ఓ బాలుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. COVID-19 చికిత్స పొందిన 6 నెలల బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ముదురు నీలం రంగులోకి మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయిలాండ్‌కు చెందిన ఓ శిశువుకు జ్వరం, దగ్గు వచ్చాయి. పరీక్షలు నిర్వహించగా COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో తల్లిదండ్రులు 3 రోజుల పాటు ఫెవిపిరావిర్ ఔషధంతో చికిత్స అందించారు. అయితే మందులను ఉపయోగించిన 18 గంటల తర్వాత బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలం రంగులోకి మారిపోయాయి.
చిన్నారి తల్లి తన బిడ్డ కంటి రంగులో మార్పును గమనించి డాక్టర్‌కు చెప్పింది. దీంతో డాక్టర్ ఫేవిపిరావిర్ వాడడం ఆపేశారు. ఐదు రోజుల తర్వాత దాని బాలుడు కళ్లు నీలం రంగు నుంచి గోధుమ రంగుకు తిరిగి వచ్చాయి. దీంతో ఫెవిపిరావిర్ వాడకాన్ని ఆవేయాలని డాక్టర్ సూచించారు. చర్మం, గోర్లు, నోరు ఇతర శరీర భాగాలు నీలిరంగు రంగులోకి మారలేదు. 3 రోజుల ఫెవిపిరావిర్ థెరపీ తర్వాత కోవిడ్ లక్షణాలు తగ్గినా కళ్లలో కార్నియా రంగు మారడంతో చికిత్సను నిలిపివేయాలని సూచించాడు. ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత 5వ రోజు కళ్లు సాధారణ రంగుకు వచ్చినట్లు వైద్య నిపుణులు నివేదిక ఇచ్చారు.
2021లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. భారతదేశంలోని 20 ఏళ్ల వ్యక్తి చికిత్సకి ఫెవిపిరావిర్ వినియోగించగా రోగి కళ్లపై సైడ్ ఎఫెక్ట్ చూపించాయి. ఫెవిపిరావిర్ వినియోగించిన రెండో రోజున, అతని అసలు ముదురు గోధుమ కళ్లు ప్రకాశవంతమైన నీలం రంగులోకి మారాయి. 2022లో థాయ్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఫెవిపిరావిర్ అనే యాంటీవైరల్‌ను కోవిడ్ చికిత్సకు ఆమోదించింది. కోవిడ్-19 బారిన పడిన పిల్లలకు చికిత్స అందిచడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
SARS-CoV-2 ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఫెవిపిరావిర్ ఉపయోగించగా కళ్లు నీలం రంగులోకి మారడాన్ని వైద్య నివేదిక ప్రధానంగా ప్రచురించింది. అతి పిన్న వయస్కుల్లో ఫెవిపిరావిర్ అసాధారణ, ప్రతికూల ప్రభావాలను చూపుతున్నట్లు నివేదిక హైలైట్ చేసింది. అయితే COVID-19 సోకిన పిల్లలకు పిల్లలకు నోటి ద్వారా ఫెవిపిరావిర్ యాంటీవైరల్‌ను అందిస్తున్నారు. ఈ వాక్సిన్ ఇంకా అభివృద్ధి దశలో ఉండడంతో పిల్లల భద్రతపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.