అన్వేషించండి

Amritpal Singh New Video: పోలీసులకు అమృత్ పాల్ సింగ్ ఓపెన్ ఛాలెంజ్ - అరెస్టుకు భయపడనంటూ వీడియో విడుదల

Amritpal Singh New Video: పంజాబ్ పోలీసులకు మత ప్రభోదకుడు అమృత్ పాల్ సింగ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. తాను అరెస్టుకు భయపడనని.. జుట్టు కూడా కత్తిరించుకోలేనని తెలిపాడు. 

Amritpal Singh New Video: పరారీలో ఉన్న మత ప్రభోదకుడు అమృతపాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. తాను ప్రజల మధ్యకు వస్తానని.. ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ గురువారం (మార్చి 30) తెలిపారు. తాను అరెస్టుకు భయపడనని, విదేశాలకు పారిపోనని అలాగే జుట్టు కత్తిరించుకోలేదని చెప్పుకొచ్చాడు. శ్రీ అకల్ తఖ్త్‌లోని జాతేదార్లు వహీర్ (మతపరమైన అవగాహన పర్యటన)ని తీసుకువెళ్తానన్నారు. అయితే వహీర్ అకల్ తఖ్త్ సాహిబ్ అంటే అమృత్‌సర్ నుంచి ప్రారంభమై బైసాఖీలోని తఖ్త్ దమ్‌దామా సాహిబ్ తల్వాండి సాబో వద్ద ముగుస్తుంది. బైసాఖీలో సర్బత్ ఖల్సాను అక్కడికి పిలవాలని అమృతపాల్ సింగ్ అన్నారు. తాను అరెస్టవుతాననే భయం తనకు లేదని.. కానీ తిరుగుబాటు మార్గంలో అలాంటి కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. అంతకుముందు అమృత్ పాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా గురువారం మధ్యాహ్నం బయట పడింది. అందులో అతను.. తాను లొంగిపోవడానికి చర్చలు జరుపుతున్నాడనే ఊహాగానాలను కొట్టిపారేసినట్లు ఉంది. అలాగే "సర్బత్ ఖల్సా"ని సమావేశపరచమని అకల్ తఖ్త్‌ను మళ్లీ కోరాడు.

గతంలో కూడా వీడియో విడుదల.. 

ఈ వీడియో విడుదలకు ఒకరోజు ముందు ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్ పాల్ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో సిక్కుల అత్యున్నత సంస్థ అయిన జతేదార్‌ను కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఒక సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వీడియో క్లిప్‌లో కూడా సమస్య తన అరెస్టు మాత్రమే కాదని.. సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యగా వాదించే ప్రయత్నం చేశాడు. 

అమృతపాల్‌ను పట్టుకునేందుకు కొనసాగుతున్న అన్వేషణ 

అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు పంజాబ్ పోలీసులు హోషియార్‌పూర్ గ్రామం, అనేక సమీప ప్రాంతాలలో ఆపరేషన్‌ను ప్రారంభించారు. పోలీసులు కూడా ఇంటింటికీ గాలింపు చర్యలు చేపట్టినా ఇంత వరకు ఫలితం లేకపోయింది. పంజాబ్ పోలీసులు మార్చి 18వ తేదీ నుంచి వారిస్ పంజాబ్ డి సంస్థ సభ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.

భారత నిఘా సంస్థ ఏం చెబుతోంది?

నేపాల్ లోని పాక్ రాయబార కార్యాలయం సహాయంతో అమృత్ పాల్ నకిలీ పాస్ పోర్టు సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడని భారత ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాత, నేపాల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో, అన్ని స్టేషన్ల దర్యాప్తు ప్రక్రియను కఠినతరం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచింది. భారతదేశం నుంచి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తోంది. అనుమానాల ఆధారంగా నేపాల్ పోలీసులు పలు చోట్ల నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. నేపాల్ లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు హై అలర్డ్ లో ఉన్నాయి. ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయం, భైరహవాలోని గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పరారీలో ఉన్న అమృత్ పాల్ ఫోటో నేపాల్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజ్ లు, లాడ్జీలలో ప్రచారం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget