By: ABP Desam | Updated at : 06 Jul 2023 08:59 PM (IST)
Edited By: Pavan
ట్రంప్ కొడుకుతో నాకు లైంగిక సంబంధం ఉంది - అమెరికన్ సింగర్ ఆబ్రే ఓడే సంచలన ఆరోపణలు
Aubrey Oday: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. తనపై వచ్చినన్ని లైంగిక ఆరోపణలు మరే అమెరికా అధ్యక్షుడిపై రాలేవు. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహారాలు నడుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెరికన్ సింగర్ ఆబ్రే ఓడే సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ జూనియర్ తో తనకు లైంగిక సంబంధం ఉందని చెప్పారు. వారి మధ్య చాలా కాలంగా అఫైర్ నడుస్తోందని తెలిపారు. వారు మొదట ఓ గే క్లబ్ లో కలిశామని, అదే రోజు బాత్రూములో లైంగికంగా కలిశామని చెప్పుకొచ్చారు.
'గే క్లబ్ లో మొదటిసారి కలిశాం'
మైకేల్ కోహెనెకు చెందిన మేయా కుల్పా పాడ్ కాస్ట్ లో తాజాగా అమెరికన్ సింగర్ 34 ఏళ్ల ఆబ్రే ఓడే పాల్గొన్నారు. ఈ పాడ్ కాస్ట్ సందర్భంగా తన అఫైర్ల గురించి ఆబ్రే వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో తనకు ఉన్న లైంగిక సంబంధం గురించి చెప్పుకొచ్చారు. తనకు, ట్రంప్ జూనియర్ కు చాలా కాలంగా అఫైర్ నడుస్తోందని, ఎన్నో సార్లు లైంగికంగా కలిశామని ఆరోపించారు. ట్రంప్ జూనియర్ ను తను మొదటిసారి ఓ ప్రముఖ గే క్లబ్ లో కలుసుకున్నట్లు చెప్పారు. అది న్యూయార్క్ లో అతి పెద్ద క్లబ్ అని.. దాంట్లో భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయని తెలిపారు. ఆ రోజు ట్రంప్ జూనియర్ తన వైపు అదోలా చూశాడని, ఆ రాత్రి క్లబ్ లోనే గడిపినట్లు చెప్పారు. అదే రోజు బాత్రూములో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు ఆరోపించారు.
Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
పాడ్ కాస్ట్ లో ట్రంప్ జూనియర్ గురించి చెప్పుకొచ్చిన ఆబ్రే ఓడే.. అప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్ ను చూశానని చెప్పారు. ట్రంప్ జూనియర్ ఇన్‌స్టాలో గే కమ్యూనిటీని కించ పరిచే అన్ని రకాల జోక్ లు ఉన్నాయని పాడ్ కాస్ట్ లో ఆబ్రే ఓడే తెలిపారు. మొదటి సారి బాత్రూములో లైంగికంగా కలవడం తనకు చాలా సౌకర్యంగా ఉందని ట్రంప్ జూనియర్ తనతో చెప్పినట్లు ఆబ్రే పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చారు.
'జూనియర్ ట్రంప్‌ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా'
ఆబ్రే ఓడే తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ మొదటి సారి 2011 లో కలుసుకున్నారు. సెలెబ్రిటీ అప్రెంటిస్ లో తొలిసారిగా ఆబ్రే ఓడే, ట్రంప్ జూనియర్ కలిశారు. మొదటిసారి వీరిద్దరూ ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. గే పార్టీలో ఏదైనా ఫన్నీ సంఘటన జరిగినప్పుడు నవ్వుతూనే తామిద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటూ స్మైల్ చేసుకున్నామని అలా అప్పుడే సన్నిహితులుగా మారిపోయామని ఆబ్రే చెప్పుకొచ్చారు. అలాగే ట్రంప్ జూనియర్ ను తానెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. కాగా గతేడాది కూడా ఆబ్రే ఓడే తనకు ట్రంప్ జూనియర్ తో సంబంధం ఉందని మొదటిసారి చెప్పారు. పేజ్ సిక్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు తనకూ ఉన్న సంబంధం గురించి ఆబ్రే ఓడే చెప్పుకొచ్చినా.. జూనియర్ ట్రంప్ మాత్రం ఈ విషయంపై ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Massive Solar Storms: సౌరవ్యవస్థలో తుఫాన్‌లు, భవిష్యత్తులో ఇంటర్నెట్, జీపీఎస్ పనిచేయవట
Gaza: ఇంకొన్ని రోజులు ప్లీజ్, సంధి పొడిగించాలని కోరుతున్న హమాస్
PM Modi in Dubai: దుబాయ్‌లో ప్రధాని మోడీ-ఘనంగా స్వాగతం పలికిన భారతీయులు
ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం
Gaza: ఇజ్రాయేల్ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
/body>