అన్వేషించండి

Alien Bodies Lab Test: మెక్సికోలో ఏలియన్ మమ్మీస్, ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్పాయంటే?

Alien Bodies Lab Test: మెక్సికోలో వెయ్యేళ్ల నాటి మానవేతర మమ్మీస్ బయటపడ్డాయి. వీటిని ఏలియన్స్ బాడీస్ గా, వీటి నమూనాలు వెయ్యేండ్ల కిందటివని అక్కడి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Alien Bodies Lab Test: మెక్సికోలో వెయ్యేళ్ల నాటి మానవేతర మమ్మీస్ బయటపడ్డాయి. వీటిని ఏలియన్స్ బాడీస్ గా, వీటి నమూనాలు వెయ్యేండ్ల కిందటివని అక్కడి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మానవేతర మమ్మీస్‌పై విస్తృతమైన ప్రయోగశాల అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనిటెజ్ ఈ పరీక్షలను నిర్వహించారు. మమ్మీస్ ఒకే అస్థిపంజరానికి చెందినవని, వాటిని కృత్రిమంగా అసెంబ్లింగ్ చేయలేదని డాక్టర్ బెనిటెజ్ నిర్ధారించారు. ల్యాబొరేటరీ పరీక్షల్లో  పుర్రెలు తారుమారు అయినట్లు లేదా తారుమారు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. 

గ్రహాంతరవాసులపై విస్తృతంగా ప్రయోగాలు చేసే UFO ఎక్స్‌పర్ట్ జర్నలిస్ట్ జెయిమ్ మౌసన్ ఈ మమ్మీలను సమర్పించారు. వీటి శరీరాలు పొట్టిగా, సుద్ద రంగులో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి మూడు వేళ్ల చేతులు, కుంచించుకుపోయిన తలలను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఒకదానిలో ఒకటి స్త్రీ అని కడుపులో అండాలు ఉన్నట్లు తెలిపారు. కడుపులో బిడ్డను మోస్తున్నట్టు కనిపించిందని చెబుతున్నారు. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో పరిశోధకులు నిర్వహించిన కార్బన్ డేటింగ్ పరీక్ష ప్రకారం ఈ నమూనాలు సుమారు 1,000 సంవత్సరాల నాటివి. వీటికి భూమిపై ఉన్న ఏ జాతితోనూ సంబంధం లేదని మౌసాన్ పేర్కొన్నారు.

శాన్ లాజారో శాసన భవనంలో ప్రమాణ స్వీకారం చేస్తూ.. ఈ నమూనాలు మన భూగోళ పరిణామంలో భాగం కాదన్నారు. UFO శిధిలాల తర్వాత కనుగొనబడిన జీవులు కాదని పేర్కొన్నారు. అవి డయాటమ్ [ఆల్గే] గనులలో శిలాజాలుగా కనుగొనబడ్డాయని వివరించారు. మన ప్రపంచంలోని మరే ఇతర జాతులతో సంబంధం లేని మానవేతర నమూనాలు ఇవని, వాటిని పరిశోధించడానికి అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయని అన్నారు. అయితే జెయిమ్ మౌసన్ వాదనలను అనేక మంది UFO, ఫోరెన్సిక్స్ నిపుణులు కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారం, బూటకం అని మండిపడ్డారు. కొంతమంది విద్యావేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు ఆ శరీరాలు కేవలం మమ్మీ చేయబడిన మానవుల పురాతన అవశేషాలు అని అభిప్రాయపడ్డారు. 

భౌతిక శాస్త్రవేత్త, ప్రెజెంటర్ ప్రొఫెసర్ బ్రియాన్ కాక్స్ ఈ బాడీలను మానవ రూపాలు అని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర ధృవీకరణ కోసం బయోటెక్నాలజీ కంపెనీ 23 అండ్ మేకి నమూనాను పంపాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక గ్రహం మీద ఉద్భవించిన ఒక తెలివైన జాతి, మానవుడిలా కనిపించడం అసంభవం అని అన్నారు.

అసలేం జరిగిందంటే
మెక్సికన్ కాంగ్రెస్లో UFO ఎక్స్‌పర్ట్ జెయిమ్ మౌసన్ వెయ్యేళ్ల క్రితం నాటి రెండు నాన్ హ్యూమన్ బాడీస్‌ని అందరి ముందుకి తీసుకొచ్చారు. అవి అచ్చం గ్రహాంతర వాసుల ఆకారానే పోలి ఉండటం సంచలనమైంది. ఏలియన్స్ గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న మౌసాన్ వింత ఆకారంలో ఉన్న మృతదేహాలపైనా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే మెక్సికన్ కాంగ్రెస్‌లో ఈ ఏలియన్స్‌ని పోలి ఉన్న డెడ్‌ బాడీలను అందరి ముందు ఉంచారు. పెరూలోని Cuscoలో తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు చెప్పారు. సాధారణ మనుషులతో పోల్చి చూస్తే ఈ డెడ్‌ బాడీస్‌లోని జెనెటిక్ కంపోజిషన్‌ 30% విభిన్నంగా ఉందని తేల్చి చెప్పారు. 

మెడ సన్నగా.. పుర్రె పెద్దగా
జెయిమ్ మౌసన్ మాట్లాడుతూ.. ‘చూడడానికి మనుషుల్లోగానే కనిపించినా.. ఆకారం పూర్తి విభిన్నంగా ఉంది. మెడ చాలా సన్నగా, పుర్రె భాగం చాలా పెద్దగా ఉంది. పక్షుల బాడీ స్ట్రక్చర్‌కి దగ్గరగా ఉంది. పళ్లు లేవు. ఎముకలు పెద్దగా బరువుగా లేవు. మానవ పరిణామ క్రమంలో ఎక్కడా మనిషి ఇలా లేడు. UFO అధ్యయనంలో ఈ రెండూ బయటపడ్డాయి. ఓ మైన్‌లో తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చాయి. ఇవి గ్రహాంతర వాసులా కాదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. కానీ అవి చాలా ఇంటిలిజెంట్ అని మాత్రం అర్థమవుతోంది. మనుషులతో పాటు చాలా రోజులు కలిసి జీవించాయి. బహుశా అప్పట్లో చరిత్రను తిరిగి రాసుంటారు’ అని అన్నారు. 

మెక్సికన్ కాంగ్రెస్‌లో ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం అందరినీ షాక్‌కి గురి చేసింది. నిజానికి .జెయిమ్ మౌసన్ గతంలోనూ ఇలాంటి సంచలనాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 2015లో ఓ మమ్మీ బాడీని కనుగొన్నారు. ఇది కూడా పెరూలోనే దొరికినట్టు వెల్లడించారు. అది చూడడానికి చాలా ఎత్తుగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు మరోసారి రెండు ఏలియన్ బాడీస్‌ని పరిచయం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget