Lions Enclosure: వీడెవడండీ బాబూ! - గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు, చివరకు!
Uzbekistan: ఉజ్బెకిస్థాన్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని మెప్పించేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి కవ్వించగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Man Entered Into Lions Cage For His Lover In Uzbekistan: ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు చాలామంది చాలా ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. నచ్చిన గిఫ్టులు ఇవ్వడం, వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన ప్రియురాలి కోసం పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా సింహాల బోనులోకి వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌లో (Uzbekistan) చోటు చేసుకుంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్‌లోని ఓ ప్రైవేట్ జూలో ఎఫ్.ఇరిస్కులోవ్ (44) అనే వ్యక్తి జూ కీపర్‌గా పని చేస్తున్నారు. ఒకరోజు రాత్రి విధుల్లో ఉండగా.. తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు పొందేలా ఏదైనా చేయాలని ప్లాన్ చేశాడు.
అలాగే, వీడియో తీస్తూ 3 సింహాలు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. పడుకున్న సింహాలు అతన్ని ఏమీ చేయలేదు. కొంతసేపటి తర్వాత ఓ సింహాన్ని కవ్వించగా మిగిలిన రెండు సింహాలు అతనిపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటన గతేడాది డిసెంబర్ 17న జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఇరిస్కులోవ్‌ను హతమార్చిన అనంతరం 3 సింహాలు బోనులో నుంచి బయటకు వచ్చి జూ ప్రాంగణంలో తిరిగాయని తెలిపారు.