Philadelphia Gunfire: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా- ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
Philadelphia Gunfire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. 11 మంది వరకు గాయపడ్డారు.
Philadelphia Gunfire: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఫిలడెల్ఫియాలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 11 మంది వరకు గాయపడ్డారు.
#UPDATE Three people were killed and 11 others wounded on Saturday after multiple shooters opened fire into a crowd in the US city of Philadelphia, according to police https://t.co/WmJBDzLc66 pic.twitter.com/cqRaXc6jAs
— AFP News Agency (@AFP) June 5, 2022
ఇదీ జరిగింది
డౌన్ టౌన్‌లో జనం ఎక్కువగా గుమికూడిన చోట ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, కనీసం 11 మంది గాయపడ్డారని ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వారాంతం కావడంతో వందలాది మంది జనం సౌత్ స్ట్రీట్‌లోకి వచ్చినట్లు పేర్కొంది.
ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియలేదు.
మే నెలలో
మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.
గతంలో జరిగిన తుపాకీ కాల్పులు
- 2012- న్యూ టౌన్‌లోని శాండీ హుక్ స్కూల్‌పై దాడి, కాల్పుల్లో 26 మంది మృతి
- 2016 - టెక్సాస్ ఆల్పైన్ స్కూల్ కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు
- 2018- టెక్సాస్‌లోని సెయింట్ ఫే స్కూల్‌లో కాల్పులు, 17 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు, 10 మంది మరణించారు.
- 2021 - టెక్సాస్‌లోని టింబర్‌వ్యూ స్కూల్‌లో కాల్పులు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.
- 2022 - టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు, 14 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు, 18 ఏళ్ల నిందితుడైన వ్యక్తిని హతమార్చారు.
Also Read: Indian currency: ఇకపై కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు ఆ ఇద్దరు- ఆర్‌బీఐ కీలక నిర్ణయం!