అన్వేషించండి

Largest Aquariums: ప్రపంచంలో అతి పెద్ద అక్వేరియాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? వాటి చూస్తే ఔరా అనాల్సిందే!

World Largest Aquariums: మామూలుగా ఇళ్లలో ఉండే అక్వేరియాలు ఎంత సైజులో ఉంటాయి? టేబుల్ మీద పెట్టే విధంగా చిన్నగా ఉంటాయి. మహా అయితే ఒక గది పరిమాణంలో ఉంటే ఇంత పెద్దదా అనుకుంటాం.

World Largest Aquariums: మామూలుగా ఇళ్లలో ఉండే అక్వేరియాలు ఎంత సైజులో ఉంటాయి? టేబుల్ మీద పెట్టే విధంగా చిన్నగా ఉంటాయి. మహా అయితే ఒక గది పరిమాణంలో ఉంటే ఇంత పెద్దదా అనుకుంటాం. అయితే చాలా చోట్ల ఎగ్జిబిషన్లనలో సందర్శకులను ఆకట్టుకునేలా అక్వేరియం ఏర్పాటు చేస్తారు. వాటిని చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ప్రపంచంలోని అతి పెద్ద అక్వేరియాల గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!. వాటిలో సొర చేపలు, తిమింగళాలు, సముద్ర జీవులు ఉంటాయి. ఆ అక్వేరియాలను సందర్శిస్తున్నప్పుడు మనం సముద్రం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. సందర్శకులను అబ్బురపరిచే, ప్రపంచంలో అతి పెద్ద అక్వేరియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

10. పశ్చిమ ఆస్ట్రేలియా అక్వేరియం (0.8 మిలియన్ గ్యాలన్లు)
పెర్త్ తీరప్రాంత శివారులో ఈ అక్వేరియం ఉంది. దీనిపేరు పశ్చిమ ఆస్ట్రేలియా అక్వేరియం అక్వేరియం ప్రధాన ట్యాంక్ 40 మీటర్లు (130 అడుగులు) పొడవు, 20 మీటర్లు (66 అడుగులు) వెడల్పుతో 30,00,000 లీటర్ల సముద్రపు నీటితో ఉంటుంది.  

9. జెనోవా అక్వేరియం (మిలియన్ గ్యాలన్లు)
ఇటలీలోని జెనోవాలో ఐరోపాలోనే అతిపెద్ద అక్వేరియం ఉంది. అక్వేరియంలో 70 ట్యాంకులు ఉంటాయి. 6,000 కంటే ఎక్కువ జంతువులకు నివాసాన్ని అందిస్తాయి. ఇందులో సొరచేపలు, డాల్ఫిన్లు, సీల్స్‌ ఉంటాయి.

8. షాంఘై ఓషన్ అక్వేరియం (మిలియన్ గ్యాలన్లు)
షాంఘై ఓషన్ అక్వేరియం ఆసియాలోని అతిపెద్ద అక్వేరియంలలో ఒకటి. ఇది అంతరించిపోతున్న పలు చైనీస్ జల జాతులకు నిలయంగా ఉంది. ఇందులో యాంగ్జీ నది నుంచి వచ్చిన అరుదైన, విలువైన జాతులు ఉన్నాయి. ఈ అక్వేరియంలో 509 అడుగుల సొరంగం ఉంటుంది.  

7. ఉసాకా మెరైన్ వరల్డ్ ( మిలియన్ గ్యాలన్లు)
ఉసాకా మెరైన్ వరల్డ్ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఉన్న ఒక థీమ్ పార్క్. ఇది 32 ట్యాంకులను కలిగి ఉంది. అంతే కాదు ఆఫ్రికాలోనే అతి పెద్ద అక్వేరియం ఇది. అక్వేరియంలో చిన్న సముద్ర గుర్రాల నుంచి సొరచేపలు, డాల్ఫిన్ల వరకు అన్నీ ఉంటాయి. అక్వేరియంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు ఉన్నాయి.  

6. మాంటెరీ బే అక్వేరియం (1.2 మిలియన్ గ్యాలన్లు)
మోంటెరీ బే అక్వేరియం కాలిఫోర్నియాలోని మాంటెరీలోని కానరీ రోలో ఉంది. అక్వేరియంలో రెండు భారీ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో స్టింగ్రేలు, జెల్లీ ఫిష్, సీ ఓటర్‌, అనేక ఇతర స్థానిక సముద్ర జాతులు ఉన్నాయి, వీటిని వాటర్‌లైన్ పైన దిగువన చూడవచ్చు.

5. తుర్కుజో (1.32 మిలియన్ గ్యాలన్లు)
దీనిని 2009లో టర్కీలో ప్రారంభించారు. అక్వేరియం ఫోరమ్ ఇస్తాంబుల్ షాపింగ్ మాల్ లోపల 80 మీటర్ల పొడవైన నీటి అడుగున సొరంగం ఉంది. టర్క్వాజో‌లో దాదాపు 10,000 సముద్ర జీవులు ఉంటాయి. ఇందులో టైగర్ షార్క్‌లు, జెయింట్ స్టింగ్రేలు, పిరాన్హాలు 29 వేర్వేరు ప్రదర్శనలలో ఉన్నాయి. 

4. ఎల్'ఓషనోగ్రాఫిక్ (1.85 మిలియన్ గ్యాలన్లు)
ఎల్'ఓషనోగ్రాఫిక్ స్పెయిన్‌లోని వాలెన్సియా నగరంలో ఉంది.  ఓషనోగ్రాఫిక్ ఐరోపాలో అతిపెద్ద అక్వేరియం. ఇందులో దాదాపు  45,000 కంటే ఎక్కువ సముద్ర జీవులు ఉంటాయట. వీటిలో 9 వాటర్ టవర్లను ఏర్పాటు చేశారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలను సూచించేలా రెండు లెవెల్స్‌లో వాటిని నిర్మించారు. నీటి అడుగున 35 మీటర్ల పొడవుతో రెండు టవర్లు ఏర్పాటు చేశారట. సొరచేపలు, తిమింగళాలు ఉంటాయట.

3. ఒకినావా చురౌమి అక్వేరియం (1.98 మిలియన్ గ్యాలన్లు)
ఒకినావా చురౌమి అక్వేరియం జపాన్‌లోని ఓషన్ ఎక్స్‌పో పార్క్‌లో ఉంది. దీనిని 2002లో ప్రారంభించారు. కురోషియో సీ అని పిలువబడే అక్వేరియం ప్రధాన ట్యాంక్ 7,5 మిలియన్ లీటర్ల (1.98 బిలియన్ గ్యాలన్లు) నీటితో ఉంటుంది. సందర్శకులు సముద్ర ప్రాణులను చూసేందుకు 60 సెంటీమీటర్ల (24 అంగుళాలు) మందంతో గాజు గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వేల్ షార్క్‌లతో పాటు అనేక ఇతర చేప జాతులు ఉంటాయి.

2. దుబాయ్ మాల్ అక్వేరియం (2.64 మిలియన్ గ్యాలన్లు)
దుబాయ్ మాల్, ప్రపంచంలోని అతిపెద్ద షాపింగ్ మాల్‌లలో ఒకటి.  దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ కాంప్లెక్స్‌లో ఉంది. అక్వేరియంలో 400కి పైగా సొరచేపలు, 33,000 కంటే ఎక్కువ సజీవ జంతువులు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని "అతిపెద్ద యాక్రిలిక్ ప్యానెల్"గా గిన్నిస్ రికార్డును సంపాదించింది. సముద్ర జీవులను చేసేందుకు 75 సెంటీమీటర్లు మందమైన గ్లాస్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2010లో షార్క్‌ ఢీ కొట్టడంతో లీకేజీ ఏర్పడింది. దీంతో తాత్కాలికంగా మూసివేశారు. 

1. జార్జియా అక్వేరియం (6.3 మిలియన్ గ్యాలన్లు)
అట్లాంటాలోని జార్జియా అక్వేరియం 1,00,000 కంటే ఎక్కువ సముద్ర జీవులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం. హోమ్ డిపో సహ-వ్యవస్థాపకుడు బెర్నీ మార్కస్ దీనికి $250 మిలియన్ల విరాళం అందించారు. నవంబర్ 2005లో దీనిని ప్రారంభించారు. తిమింగలం, సొరచేపలను ఉంచడానికి దీనిని నిర్మించారు. అయితే దీనిపై వివాదం తలెత్తింది. రెండు వేల్ షార్క్‌లు మరణించడంతో తిమింగలం, సొరచేపలను భారీ అక్వేరియంలో ఉంచడంపై ఆందోళనలు మొదలయ్యాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget