Ajay Banga Corona Positive: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నామినీ అజయ్ బంగాకు కరోనా, ఢిల్లీలో క్వారంటైన్ - ప్రధానితో భేటీ రద్దు
Ajay Banga Corona Positive: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగాకు కరోనా సోకింది.
Ajay Banga Corona Positive:
ఢిల్లీలో రెండ్రోజుల పర్యటన..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఫ్లూ కూడా దాడి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అజయ్ బంగా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు కరోనా సోకినట్టు ఎంబసీ అధికారులు వెల్లడించారు. రొటీన్ టెస్టింగ్‌లో భాగంగా పరీక్ష చేయగా..కొవిడ్ సోకినట్టు నిర్ధరణ అయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అజయ్ బంగా సమావేశం అవ్వాల్సి ఉంది. ఆయనకు కరోనా సోకడం వల్ల ఈ భేటీని రద్దు చేశారు. ప్రస్తుతానికి బంగా క్వారంటైన్‌లో ఉన్నారని, సమావేశం అవడం కుదరడం లేదని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపింది. భారత్‌కు వచ్చే ముందు టెస్ట్ చేయించుకున్నారు బంగా. అప్పుడు రిపోర్ట్‌లో నెగటివ్ వచ్చింది. ఆ తరవాతే భారత్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.
#UPDATE | The United States nominee for World Bank President Ajay Banga tested Covid positive upon arrival in Delhi. Banga has conducted multiple tests for Covid during his tour and tested negative before departing for India: Spokesperson, US Embassy in New Delhi
— ANI (@ANI) March 24, 2023
(File pic) https://t.co/WEdCFSkPoU pic.twitter.com/pht56VZGAq
Ajay Banga has not met with any Indian counterparts. He is quarantining in isolation, in adherence to local guidelines: Spokesperson, US Embassy in New Delhi
— ANI (@ANI) March 24, 2023
దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అటు ఫ్లూ కూడా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా ఆసుపత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇప్పటికే అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కూడా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం