అన్వేషించండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరగనున్న చలి- వచ్చే వారం మరో అల్పపీడనం!

ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రాంతం వచ్చే వారానికి బలపడొచ్చని ఏపీ వెదర్ మ్యాన్‌ చెప్పారు.

ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన  ఉపరితల ఆవర్తనం వచ్చే పశ్చిమ దిశగా కదులుతోంది. రాగల 12 గంటల్లో నికోబార్ దీవుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం మీద డిసెంబర్ 17 ఉదయం వరకు 35-45 kmph నుంచి 55 kmph వేగంతో గాలులు వీచే వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 17 ఉదయం వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 35-45 కి.మీ వేగంతో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 17న నైరుతి బంగాళాఖాతంలో గంటకు 35-45 కి.మీ వేగంతో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 17 ఉదయం వరకు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితి అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖాధికారులు సూచించారు.

ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రాంతం వచ్చే వారానికి బలపడొచ్చని ఏపీ వెదర్ మ్యాన్‌ చెప్పారు. దీని ఫలితంగా వచ్చే వారం చివరిలో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. ఆ అల్పపీడనం వెళ్లే మార్గంపై ఇంకా క్లారిటీ రాలేదని వచ్చాక ఎక్కడ వర్షాలు పడొచ్చనేది స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎలాంటి వర్షసూచన లేదన్నారు. వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి కర్నూలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. ఉత్తర భారత దేశం నుంచి వీచే గాలులు కారణంగా చలి తీవ్రత వారం రోజుల పాటు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. తిరుపతి, కడప, నెల్లూరు పరిసరాల్లో అంతగా ఉండకపోవచ్చన్నారు. సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులు కారణంగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉండదన్నారు. 

వచ్చే వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ మ్యాన్‌. బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుందన్నారు. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా వేయలేదని తెలిపారు. దీని కోసం ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్‌ రానుంది. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుందని అంచనా. 1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదన్నారు. 2) వెష్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉందని అభిప్రాయపడ్డారు. 

పశ్చిమ మధ్య ఉన్న ఈస్ట్‌సెంట్రల్ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం గంటకు 14 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది అమినీదీవికి (లక్షద్వీప్) పశ్చిమ-వాయువ్యంగా 1100 కి.మీలో కేంద్రీకృతమై ఉంది. డిసెంబర్ 17 సాయంత్రం అంటే ఈ సాయంత్రానికి ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగాా మారిపోనుంది. 

అల్పపీడనం భారత తీరానికి దూరంగా కదులుతున్నందున హెచ్చరికం ఏమీ లేవు. తూర్పు మధ్య అరేబియా సముద్రం... డిసెంబర్ 17 ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉండి, ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రం డిసెంబర్ 17 సాయంత్రం వరకు అల్లకల్లోలంగా ఉండి ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. నైరుతి అరేబియా సముద్రం డిసెంబర్ 17 సాయంత్రం వరకు సముద్ర పరిస్థితి ఉద్ధృతంగా ఉండి ఆ తర్వాత మెరుగుపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖాధికారులు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget