Putin Visits Mariupol: రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో పర్యటించిన పుతిన్, దేనికి సంకేతం?
Putin Visits Mariupol: రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో పుతిన్ పర్యటించారు.
Putin Visits Mariupol:
మరియుపోల్‌లో పర్యటన..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచే దేశాలన్నీ ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. అటు రష్యా మాత్రం ఈ నిర్ణయం చెల్లదని తేల్చి చెప్పింది. దీనిపై వాడి వేడి చర్చలు జరుగుతుండగానే పుతిన్..రష్యా ఆక్రమిత మరియుపోల్‌లో పర్యటించటం మరింత సంచలనమైంది. చాన్నాళ్ల యుద్ధం తరవాత ఈ పోర్ట్‌ను ఆక్రమించుకుంది రష్యా. అప్పటి నుంచి పుతిన్ ఇటువైపు రాలేదు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి పర్యటించి వాతావరణాన్ని వేడెక్కించారు. అంతకు ముందు క్రిమియాలోనూ పర్యటించారు. క్రిమియాలో రష్యా, ఉక్రెయిన్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ మధ్య ఇదే ప్రాంతంలోని బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరిగింది. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ పనే అని రష్యా ఆరోపించింది. గట్టిగా బదులు చెబుతామని చెప్పింది. ఆ తరవాత ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రత పెంచింది. కీలక నగరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి.
#UPDATE Russian President Vladimir Putin visited the city of Mariupol after a stop in Crimea, the Kremlin's press service said Sunday, according to Russian news agencies.
— AFP News Agency (@AFP) March 19, 2023
It was his first trip to the port city in southern Ukraine, which Moscow captured after a long siege.
అమెరికా సపోర్ట్..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ నిర్ణయం సరైందేనని సమర్థించారు. యుద్ధ నేరాలు పాల్పడిన వారిపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు వెల్లడించారు. The Guardian ఈ విషయం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కోర్టు తీర్పులను కొన్ని దేశాలు పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ పుతిన్ విషయంలో ఆ కోర్టు ప్రస్తావించిన అంశాలు సరైనవే అని స్పష్టం చేశారు. నిజానికి పుతిన్‌పై చాన్నాళ్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బైడెన్. పదేపదే అణు బాంబుల గురించి ప్రస్తావించడాన్ని చాలా సందర్భాల్లో ఖండించారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామనీ భరోసా ఇచ్చారు. ఇటీవలే జో బైడెన్ ఉక్రెయిన్ కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా పోలాండ్ లో పర్యటించిన జో బైడెన్... ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అనంతరం కీవ్ వెళ్లిన బైడెన్ ఉక్రెయిన్ రాజధానిలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు. జెలెన్స్కీతో కలిసి ఉక్రెయిన్ కోసం పోరాడిన సైనికుల కోసం ఏర్పాటుచేసిన వాల్ ఆఫ్ రిమెంబరెన్స్‌ను సందర్శించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించారు.
Also Read: Punjab Internet Ban: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు పొడిగింపు