Punjab Internet Ban: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు పొడిగింపు
Punjab Internet Ban: పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల్ని మరో రోజు పొడిగించారు.
Punjab Internet Ban:
అన్ని చోట్లా అలెర్ట్..
పరారీలో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పంజాబ్ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టిన వెంటనే అక్కడ ఇంటర్నెట్ను ఆపేశారు. అయితే...ఇప్పుడు ఈ ఆంక్షల్ని పొడిగించారు. రేపటి(మార్చి 20) వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఇంటర్నెట్తో పాటు SMS సర్వీస్లపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
All mobile internet services, all SMS services (except banking & mobile recharge) & all dongle services provided on mobile networks, except the voice call, in the territorial jurisdiction of Punjab suspended till March 20 (12:00 hours) in the interest of public safety: Dept of… https://t.co/rQKCP9QxRG pic.twitter.com/ggTr1qk8M2
— ANI (@ANI) March 19, 2023
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే...ఆయన అనుచరులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. Waris Punjab De చీఫ్ అమృత్ పాల్ సింగ్‌కు సలహాదారుగా ఉన్న దల్జీత్ సింగ్ కల్సీని అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం అమృత్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పరారయ్యాడు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్న చోట ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎలాంటి అలజడులు రేగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. జలంధర్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ కీలక ప్రకటన చేశారు.
"వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం. అతడి గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటికే కేసు నమోదు చేశాం. పంజాబ్ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మొత్తం 78 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నాం. మరి కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి."
- కుల్దీప్ సింగ్ చాహల్, జలంధర్ కమిషనర్
రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా అశాంతి వాతావరణం సృష్టించకుండా అప్రమత్తమయ్యారు. అటు కేంద్ర ఏజెన్సీలు కూడా ప్రజల్ని అప్రమత్తం చేశాయి. వదంతులను వ్యాప్తి చేయొద్దని సూచించాయి. పాకిస్థాన్ నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్‌లు పెడుతున్నారని చెప్పింది. ఆ సమాచారాన్నినమ్మొద్దని తెలిపింది.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు, శ్రీనగర్‌లోని జోడో యాత్ర స్పీచ్‌పై విచారణ