అన్వేషించండి

Visakha Crime News: కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో భార్యే నిందితురాలు - నగలు తాకట్టుపెట్టిమరీ హత్యకు సుపారీ!

Visakha Crime News: విశాఖలో ఇటీవలే హత్యచేయబడ్డ కానిస్టేబుల్ రమేష్ కేసును పోలీసులు చేధించారు. కానిస్టేబుల్ భార్య శివాని, ఆమె ప్రియుడు రామారావుయే నిందితులని తేల్చారు.  

Visakha Crime News: విశాఖపట్నం జిల్లాలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును ఎంవీపీ పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ హత్య కేసులో ఆయన భార్య శివానియే నిందితురాలిగా తేల్చారు. ప్రియుడి మోజులో పడి కావాలనే భర్తను హత్యచేయించినట్లు విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. అయితే మూడు రోజులు క్రితం కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్ట్ మార్టంకు పంపించామని.. అయితే ఆ రిపోర్టులో రమేష్ ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలిందని చెప్పారు. దీంతో కేసును లోతుగా విచారించగా భార్య శివానియే ప్రియుడి కోసం భర్తను చంపించినట్లు పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే? 

విశాఖకు చెందిన కానిస్టేబుల్ రమేష్ కు, శివానికి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి శివాని.. రామారావు అనే మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. అతడితో వివాహేతర సంబంధం కూడా కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న రమేష్.. చాలా సార్లు భార్యతో గొడవ పడ్డాడు. నీకు అంతగా అతడు నచ్చితే పిల్లలను తన వద్దే వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని చెప్పాడు. కానీ శివానీ మాత్రం ప్రియుడితో పాటు పిల్లలు కూడా కావాలని మొండికేసింది. అందుకు రమేష్ అస్సలే ఒప్పుకోలేదు. దీంతో శివాని రమేష్ పై కోపం పెంచుకుంది. ఎలాగైనా సరే అతడి అడ్డు తొలగించుకొని ప్రియుడితో హాయిగా జీవించాలనుకుంది. ఈక్రమంలోనే అతడిని చంపేందుకు ప్రియుడు రామారావుతో  ప్లాన్ వేసింది. 

నగలు తాకట్టుపెట్టి, భర్త హత్యకు సుపారీ! 
ప్రియుడి స్నేహితుడు నీలా అనే వ్యక్తికి భర్తను చంపే పని అప్పజెప్పింది. అందుకోసం తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరీ లక్ష రూపాయలు ఇచ్చింది. ప్లాన్ ప్రకారమే మూడు రోజుల క్రితం భర్త రమేష్ కు ఫుల్లుగా మద్యం తాగించింది. ఆపై వీడియో తీసింది. అతడు నిద్రలోకి జారుకోగానే ప్రియుడికి, సుపారీ ఇచ్చిన నీలాకు ఫోన్ చేసింది. వెంటనే వారిద్దరూ ఇంటికి వచ్చారు. రామారావు బయటే ఉండి ఎవరూ రాకుండా చూడంగా.. నీలా మాత్రం శివాని సాయంతో ఇంట్లోకి చేరాడు. భార్య శివాని రమేష్ కాళ్లు పట్టుకోగా.. నీలా రమేష్ మొహంపై దిండు పెట్టి నొక్కి చంపాడు. ఆ తర్వాత నీలా, బయటే ఉన్న రామారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. భార్య శివానీ మాత్రం ఆమెకు ఏమీ తెలియనట్లు భర్త చనిపోయినట్లు అందరికీ తెలిపింది. ఏమైందో తెలియదని వివరించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే భార్య ప్రవర్తనలో తేడా.. పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడక చనిపోయినట్లు రావడంతో పోలీసులు ఈ కేసు ఛేదించారు.

రమేష్ భార్య శివానిని గట్టిగా విచారించగా.. అసలు విషయం బయట పెట్టింది. ప్రియుడి కోసం తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకొంది. ఎప్పుడు, ఎలా హత్య చేశారనేది విచారణలో వెల్లడించింది. అయితే కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో A1 గా భార్య శివాని, A2 గా ప్రియుడు రామారావు, A3 గా నీలా అరెస్ట్ చేశారు. శివానికి ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవలు ఉన్నాయని విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ చెబుతున్నారు. ఆమెకు ముందు నుంచే నేర స్వభావం ఉన్నట్లు గుర్తించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget