Viral Video: పులి కనిపించగానే ఈ ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
Viral Video: మహారాష్ట్రలో ఓ పులి రోడ్డుదాటటం కోసం ట్రాఫిక్ పోలీస్, వెహికిల్స్‌ను ఎక్కడికక్కడే నిలిపివేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video:
దట్టమైన అడవులు ధ్వంసం చేసి వాటి మధ్య రోడ్లు వేసుకుంటున్నాం. ఒక్కోసారి ఆ రోడ్డు దాటుతూ మూగజీవాలు ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. ఏటా ఇలా ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఇలా వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటే భయపడటమో,వాటిని భయపెట్టడమో చేస్తుంటారు చాలా మంది. కానీ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆయనకు సెల్యూట్ చేస్తోంది. మహారాష్ట్రలో దట్టమైన అడవి మధ్యలో రోడ్డు మార్గం ఉంది. అక్కడ తరచుగా వన్యప్రాణులు రోడ్డు దాటుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ ఓ పులి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. వాహనాలు అటు ఇటు వేగంగా తిరగటం చూసి ఆగిపోయింది. ఇది చూసిన ట్రాఫిక్ పోలీస్ వెంటనే వాహనదారుల్ని ఎక్కడికక్కడే ఆపేశాడు. ట్రాఫిక్ అంతా క్లియర్ చేశాడు. వెంటనే ఆ పులి రాజసంగా నడుచుకుంటూ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఓ బైక్‌పైన ఉన్న వ్యక్తి అత్యుత్సాహంతో కిందకు దిగి
వీడియో తీయబోతుండగా, ట్రాఫిక్ పోలీస్ వారించాడు. నిశ్శబ్దంగా ఉండాలంటూ సూచించాడు. అందరూ సైలెంట్ అయిపోయాక ఆ పులి మెల్లగా అడవిలోకి వెళ్లింది. అది వెళ్లిపోయేంత వరకూ వాహనదారులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు. "పులి కోసం గ్రీన్ సిగ్నల్ వేశారు" అని ట్వీట్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కొందరు బ్రహ్మపురి, నగ్‌బిర్ మార్గ మధ్యలో జరిగి ఉంటుందని చెబుతున్నారు.
Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022
This video is from Chandrapur, Maharashtra!https://t.co/Jn5PfQ3oeW
— Sushil Sarap 🇮🇳🇫🇷🇬🇧🇷🇺🇦🇪🇮🇱🇧🇷🇸🇦🇯🇵 (@SarapSushil) July 23, 2022
Sir this video belong to Maharashtra's chandrapur dist, Place- Bramhapuri, that is Bramhapuri to Nagbhid road,that time I am also there, also one of video I have,just few days before almost same place same tiger 🐅 pic.twitter.com/Lad3ieJmyK
— RJ Philip (@RJPhilip2) July 24, 2022