Viral Video: నాతో పెట్టుకుంటే మడతడి పోద్ది, ఐస్‌క్రీమ్ వెండార్‌కే షాక్ ఇచ్చిన కస్టమర్ - వైరల్ వీడియో
Viral Video: టర్కీలో ఓ కస్టమర్ ఐస్‌క్రీమ్ వెండార్‌కే షాక్ ఇచ్చాడు.
Turkey Ice Cream Vendor:
ఐస్‌క్రీమ్ ఫైట్..
సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్ సర్వ్ చేసే వీడియోలు (Viral Video) కొన్ని చూసే ఉంటారు. టర్కిష్‌లోని ఐస్‌క్రీమ్ వెండార్లు ఓ పెద్ద స్టిక్ చివర్లో ఐస్‌క్రీమ్ పెట్టి కస్టమర్స్‌తో ఆడుకుంటూ ఉంటారు. ఆ ఐస్‌క్రీమ్‌ను అందుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇదంతా కడుపుబ్బా నవ్విస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే...ఓ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీమ్ వెండార్‌కే షాక్ ఇచ్చాడు. నాతోనే ఆటలా అంటూ ఆ స్టిక్‌ను గట్టిగా పట్టుకుని లాగేసుకున్నాడు. దానికి చివర్లో ఉన్న ఐస్‌క్రీమ్‌ను నిముషంలో తినేశాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు ఆ వెండార్‌ను కింద పడేసేంత పని చేశాడు ఆ కస్టమర్. చేతులు రెండు గట్టిగా పట్టుకుని, వెనక్కి నెట్టేసి...ఇలా ఓ చిన్న యుద్ధమే చేశాడు. ఆ తరవాత ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించాడు. ఆ తరవాత నవ్వుతూ వెండార్‌వైపు చూశాడు. వెంటనే ఆ వెండార్ "మూతి తుడుచుకోండి" అంటూ టిష్యూ పేపర్ ఇచ్చాడు. ఓ యూజర్ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. 20 లక్షల వ్యూస్ వచ్చిన ఈ వీడియోను వేలాది మంది షేర్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "దాదాపు చేతులు విరగ్గొట్టేశాడు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా..."ఐస్‌క్రీమ్ తిన్నాక అతని ముఖాన్ని గమనించారా ఎంత గర్వపడ్డాడో" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "నేనేదో బాధలో ఉండగా ఈ వీడియో చూశాను. అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
I feel like this is how I would react if I met one of these vendors lol pic.twitter.com/oqsp1y0hnk
— Lance🇱🇨 (@BornAKang) January 9, 2023
I feel like this is how I would react if I met one of these vendors lol pic.twitter.com/oqsp1y0hnk
— Lance🇱🇨 (@BornAKang) January 9, 2023
I feel like this is how I would react if I met one of these vendors lol pic.twitter.com/oqsp1y0hnk
— Lance🇱🇨 (@BornAKang) January 9, 2023
His very proud face after he won the battle, I can't 😂
— Billy 🌱 (@kurogamon) January 9, 2023
Also Read: NCLAT - Google: గూగుల్‌కు మరోసారి షాకిచ్చిన లా ట్రైబ్యునల్, స్టే ఇవ్వడానికి నిరాకరణ