Viral Video: బాత్‌టబ్‌లో పాముని మెడలో వేసుకుని చిన్నారి డ్యాన్స్, అలాగే బ్రష్ చేసుకుంది కూడా - వైరల్ వీడియో
Viral Video: ఓ చిన్నారి పాముని మెడలో వేసుకుని బాత్‌టబ్‌లో బ్రష్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
ఇదెక్కడి ధైర్యమండీ బాబు..
పాములంటే పెద్ద వాళ్లే వణికిపోతారు. ఇక చిన్న పిల్లలైతే ఆ పేరు చెప్పినా భయపడిపోతారు. కానీ...ఈ చిన్నారి మాత్రం చాలా డేరింగ్. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంతో ధైర్యంగా ఓ పాముని మెడలో వేసుకుంది. అంతే కాదు..దాన్ని అలాగే బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తాపీగా బ్రష్ కూడా చేసుకుంది. పాముని నేరుగా చూసేందుకే వణికిపోయే వాళ్లు...ఈ వీడియో చూసి "అమ్మో ఏంటీ పిల్ల ధైర్యం" అని ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా మెడలో నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుని మరీ బ్రష్ చేసుకుంది ఆ చిన్నారి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయిపోయింది. బాత్‌టబ్ వద్ద ఈ చిన్నారి మెడలో పాము వేసుకుని...బ్రష్ చేసుకుంటూ ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram
పాముతో టెన్షన్ టెన్షన్..
పాములు ఎప్పుడు వచ్చి ఇళ్లలో దూరుతాయో ఎవరూ కనిపెట్టలేరు. చిన్న సందు దొరికినా వచ్చేస్తాయి. ఎక్కడో దాక్కుంటాయి. ఇల్లు సర్దుతుంటేనో, అనుకోకుండానో అవి మన కంట పడతాయి. కర్ణాటకలోని మైసూరులోనూ ఇదే జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా షూలో దాక్కుంది. పాములు పట్టుకునే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీసేందుకు చాలానే కష్టపడ్డాడు. స్నేక్ హుక్‌తో షూని అలా టచ్ చేశాడో లేదో..వెంటనే పడగ విప్పి బుస కొట్టింది కోబ్రా. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా... వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తి...లోపల పాముని చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి షూలో నుంచి పాముని బయటకు తీశాడు. ఇలా షూలో పాము దాక్కుని అందరినీ హడలెత్తించటం ఇదే తొలిసారి కాదు.
Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe.
— Bharathirajan (@bharathircc) October 10, 2022
#ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne
Also Read: Prabhas Fans అత్యుత్సాహంతో థియేటర్లో మంటలు, ప్రాణ భయంతో ప్రేక్షకుల పరుగులు