Viral Video: పులితో పరాచకాలా? కాదురా నాయనా ఇది అంతకుమించి!
Viral Video: పులి పిల్లలతో ఓ యువతి ఆడుకుంటోన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని చూసేవారికి షాక్ ఇస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి.. పులి పిల్లలతో ఆడుకుంటున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇదీ సంగతి
Tiger-tiger678 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ యువతి.. పులి పిల్లలను ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకుంటోంది. అంతేకాదు వాటికి ముద్దులు పెడుతోంది. అవి కూడా ఆమె చుట్టూ చాలా ప్రేమగా తిరుగుతున్నాయి.
View this post on Instagram
దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటికే 11,000 పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియో కింద నెటిజన్లు షాక్ అయినట్లు కామెంట్లు పెడుతున్నారు.
మరో వీడియో
ఓ యువతి.. చిరుతకు లిప్ లాక్ ఇచ్చిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని ముద్దాడటం మనం చూసే ఉంటాం. చిరుతను ముద్దాడటం ఏంటి? అని అవాక్కవుతున్నారా? ఆఫ్రికన్ ఎనిమల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇటీవల ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో చిరుత వద్ద పడుకుని ఉన్న ఓ యువతి దాన్ని ముద్దాడుతూ కనిపించింది.
View this post on Instagram
అయితే చిరుత కూడా ఏమీ అనకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో సోషస్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Viral Video: కాకి ముందు కరాటే చేసిన ఎలుక- ఫన్నీ వీడియో చూశారా?