(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: టాయిలెట్‌లో 7 అడుగుల మొసలి, భయంతో వణికిపోయిన గ్రామస్థులు
Viral News: యూపీలోని ఓ గ్రామంలో టాయిలెట్‌లో 7 అడుగుల మొసలి కనిపించింది.
Crocodile in Toilet:
యూపీలో ఘటన..
టాయిలెట్‌లో బల్లులు, బొద్ధింకలు కనిపిస్తేనే జడుసుకుంటాం. అలాంటి కొన్నిసార్లు పాములు దూరి ముచ్చెమటలు పట్టిస్తాయి. యూపీలోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఇంట్లోని వాష్‌రూమ్‌లో ఏకంగా మొసలే వచ్చింది. దాదాపు 7 అడుగుల పొడవైన ఆ మొసలిని చూసి వణికిపోయారు స్థానికులు. నగ్ల పాసీ గ్రామంలో రెండ్రోజుల క్రితం జరిగిందీ ఘటన. ఉదయం టాయిలెట్‌లోకి వెళ్లగానే పెద్ద మొసలి కనిపించింది. ఇది చూసి భయపడిన గ్రామస్థులు వెంటనే ఆ బిల్డింగ్ ఓనర్‌కు కాల్ చేసి చెప్పారు. ఆ తరవాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు Wildlife SOS సాయం కోరారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నలుగురు సభ్యులతో కూడిన NGO సంస్థ కూడా మొసలిని పట్టుకోవడం సాయం అందించింది. వాష్‌రూమ్‌లో నుంచి మొసలిని రక్షించి, ట్రాప్ కేజ్‌లో బంధించింది. ఇందుకోసం రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆ తరవాత మొసలిని అడవిలోని ఓ కొలనులోకి వదిలారు. ఇదే ఫిరోజాబాద్‌లో నెల రోజుల క్రితం ఇలాగే ఓ మొసలి స్థానికులను భయపెట్టింది.
"సమాచారం అందుకున్న వెంటనే మేం ఘటనా స్థలానికి చేరుకున్నాం. వైల్డ్‌లైఫ్ SOS అధికారులూ సమాచారం అందించాం. మొసలిని సురక్షితంగా అడవిలోకి వదలటంలో వాళ్లు చాలా సాయం చేశారు. ఇదే నెలలో ఇలాంటి ఘటన జరగడం రెండో సారి. గతంలోనూ ఓ మొసలిని ఇలానే రక్షించాం. లోవర్ గంగా కెనాల్ ఇక్కడికి చాలా దగ్గరగా ఉంది. అక్కడి నుంచి తరచూ మొసళ్లు ఈ గ్రామంలోకి వస్తున్నాయి. అయినా వాటిని చూసి భయాందోళనలకు లోనవ్వకుండా గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఈ విషయంలో వాళ్లను అభినందిస్తున్నాం"
- అటవీ అధికారులు
వైరల్ వీడియో
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ జంతువులు, పక్షులను కెమెరాలో దగ్గరగా క్యాప్చర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎక్కువే. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఎంతో కష్టపడి డ్రోన్ సాయంతో షూట్ చేస్తుండగా ఓ మొసలి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది.
Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022
ఓ డ్రోన్ నది మీదుగా వెళుతూ మొసలిని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి డ్రోన్‌ను నెమ్మదిగా గమనించింది. కొద్ది సెకన్ల తర్వాత మొసలి నీటి నుంచి తలను పైకెత్తి ఎగిరి ఒకేసారి డ్రోన్‌ను నోటకరుచుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేసింది. డ్రోన్ శబ్ధానికి మొసలి అలా రియాక్టయిందని కొందరు యూజర్లు కామెంట్ చేయగా. మరికొందరు మాత్రం డ్రోన్ పైలట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాల్సిందని అన్నారు.
Also Read: Asad Ahmad Encounter: యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్, యోగితో అట్లుంటది మరి