Vinay Heeramat: ఈ కుర్రాడికి డబ్బులెక్కవయిపోయాయి - ఏం చేయాలో తెలియట్లేదు - మీరేమైనా సాయం చేయగలరా ?
Vinay Hiremat: చిన్న వయసులోనే వేల కోట్లు సంపాదిన వినయ్ హిరేమత్ కు బోర్ కొడుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నాడు.
Vinay Hiremat who earned thousands of crores at a young age, is bored : జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించాలనే గోల్ ఉంటుంది. ఎంత సంపాదించాలి అనే గోల్ మాత్రం ఉండదు. ఎందుకంటే లక్ష గోల్ పెట్టుకుంటే.. అది అందుకున్న తర్వాత కోటి అనుకుంటారు. కోటి అందుకుంటే ఆ తర్వాత పది కోట్లు అనుకుంటారు. ఇలా ఆశకు.. ఆశయానికి హద్దు ఉండదు. ఎందుకంటే.. డబ్బు ఎంత ఉన్నా.. ఆకలి తీరదు. ఇష్టమైన సీటు లేదా మరో ఆహారపదార్థం కొంత తినే సరికి వెగటు పడుతుంది. కానీ డబ్బులు మాత్రం ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కొంత మంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారికి తన దగ్గర ఉన్న డబ్బు చూసి ఇంత డబ్బు ఏం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు వినయ్ హిరేమత్.
వినయ్ హిరేమత్ ఎన్నారై. చిన్న వయసులోనే ఓ టెక్ సంస్థను స్థాపించాడు. దాని పేరు లూమ్. దానిని విజయవంతమైన కంపెనీగా మలిచారు. ఈ క్రమంలో గతేడాది దానిని అట్లాసియన్ అనే సంస్థకు అమ్మేశాడు. ఆ కంపెనీ తిరస్కరించేనంత ఆఫర్ ఇచ్చింది. 975 మిలియన్ డాలర్లు ఇచ్చేస్తామని చెప్పడంతో వినయ్ హిరేమత్‌కు మైండ్ బ్లాంక్ అయితే సంతకాలు పెట్టేశాడు. భారత కరెన్సీలో రూ.8 వేలకుపైగా కోట్లు వినయ్ ఖాతాలో పడ్డాయి. ఆయన వయసు కేవలం 35 ఏళ్లు. ఇంత డబ్బు రావడంతో హిరేమత్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
కొన్నాళ్లు తన గర్ల్ ఫ్రెండ్ తో తిరిగాడు. తర్వాత ఆమె తన డబ్బుపై ఆశపడుతోందని భావించి బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడేమి చేయాలో తెలిక కిందా మీదా పడుతున్నాడు. ఎందుకంటే ఆ డబ్బు వల్ల అతనికి ఎలాంటి ఆనందం కలగడం లేదు. నేను ధనవంతుడినయ్యా.... జీవితంలో ఏం చేయాలో నాకు ఇప్పుడు తెలియడం లేదు. కంపెనీని విక్రయించిన తర్వాత.. నేను మళ్లీ పని చేయాల్సిన అవసరం లేకుండా పూర్తిగా సంబంధం లేని స్థితికి చేరుకున్నానని ఆవేదన చెందుతున్నాడు. సంపాదన లేదా హోదా కోసం నాకు ఇంకా ఎలాంటి కోరికలు లేవు.. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నాను. జీవితంపై సానుకూలంగా లేన అని అంటున్నాడు.
వినయ్ హీరేమత్ కు ఇప్పుడు డబ్బే భారంగా మారిందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ముందు గా తాను సంపాదించినది డబ్బు.. సంపద అనే మాట మర్చిపోవాలనని.. నిజమైన సంపద.. సృష్టించేదేనని.. వర్క్ మీద దృష్టి పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. మరో కొత్త సంస్థ స్థాపించడం గురించి ఆలోచించాలని అంటున్నారు. మరి హీరేమత్ ఏమనుకుంటారో కానీ.. ఆయన ముందుగా హిమాలయాలకు వచ్చి కొంత కాలం ప్రశాంతంగా ఉండాలన అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.