పెళ్లిలో వధూవరులు ఏడుపే ఏడుపు.. సీన్ రివర్స్, అసలు ఏం జరిగిందంటే..
పెళ్లిలో వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని చూసి వధువు సైతం కన్నీరు పెట్టుకుంది.
సాధారణంగా పెళ్లిలో వధువు తరఫు కుటుంబికులు అప్పగింతల సమయంలో కన్నీరు పెట్టుకుంటారు. వధువు కూడా తల్లిదండ్రులను వదిలి వెళల్లేక భావోద్వేగానికి గురవ్వుతుంది. అయితే, ఇక్కడ సీన్ రివర్స్.. ఓ వరుడు పెళ్లిలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని చూసి వధువు కూడా ఏడ్చేసింది. అయితే, ఇదేదో బాధతో వచ్చిన కన్నీళ్లు కావులెండి. భావోద్వేగంతో ఉబికివచ్చిన ఆనంద భాష్పాలు.
‘విట్టీ వెడ్డింగ్’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు ముందుగా మోకాలిపై కూర్చున్నాడు. దీంతో వధువు అతడి మెడలో మాల వేసింది. ఆ తర్వాత ఆమె మోకాలిపై కూర్చోగా వరుడు దండవేశాడు. ఆ తర్వాత అతడు భావోద్వేగానికి గురయ్యాడు. అతడి కళ్ల నుంచి వస్తున్న ఆనంద భాష్పాలను చూసి.. వధువు సైతం ఎమోషనల్ అయ్యింది. వారిద్దరినీ చూసి కుటుంబ సభ్యులు కళ్లు కూడా చెమ్మగిల్లాయి. మొత్తానికి ఆ పెళ్లి.. అందరి గుండెలను బరువెక్కించింది. అంతేకాదు.. ఈ వీడియో చూస్తే మీ కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి. ఈ వీడియోను ఇప్పటికే 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇద్దరు అంత ఎమోషనల్‌గా ఉన్నారంటే.. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజనులు కామెంట్లలో తెలుపుతున్నారు.
ఆ ఎమోషనల్ వీడియోను ఇక్కడ చూడండి:
ఇటీవల పెళ్లిలో జరిగే వింతలు, విశేషాలు సోషల్ మీడియాలో భలే వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఓ వధువు తొలిరాత్రి వీడియో కూడా వైరల్‌గా మారింది. తొలిరాత్రి సందర్భంగా మంచాన్ని అందంగా ముస్తాబు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, మరి ఆ వధువు అమాయకత్వమో.. చిలిపితనమో గానీ.. ఆ మంచాన్ని చూసి ఓ డైలాగ్ వేసింది. పూలన్నీ మంచం మీద వేస్తే.. ఎక్కడ పడుకోవాలని అనడంతో నవ్వులు విరిశాయి. ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. దీంతో చాలామంది షేర్లు కూడా చేసుకున్నారు. ఈ వీడియో చూసి చాలామంది జోకులు కూడా పేలుస్తున్నారు.
ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి కూడా నెటిజనులను ఆకట్టుకుంది. లాంబాక్ తెగకు చెందిన 20 ఏళ్ల యువతి నూర్ ఖుస్నాల్, వరుడు కొరిక్ అక్బర్‌ను పెళ్లి చేసుకుంటున్న సమయంలో.. అకస్మాత్తుగా ఓ యువతి ప్రత్యక్షమైంది. అతను మరెవ్వరో కాదు.. వరుడి మాజీ ప్రియురాలు. ఆమెను చూడగానే కొరిక్ షాకయ్యాడు. ఆమె కోరిక విన్న తర్వాత వధువు కూడా షాకైంది. ఎందుకంటే.. ఆమె కూడా వరుడిని పెళ్లి చేసుకుంటానని వధువు కుటుంబ సభ్యులను కోరింది. ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అతడికి ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేశారు.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!