
Road Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం, లోయలో పడిన వాహనం - 5 గురు చిన్నారులు సహా 8 మంది మృతి
Accident: జమ్ముకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దక్సుం ప్రాంతంలో కార్ లోయలో పడిపోయి 8 మంది మృతి చెందారు. మృతుల్లో 5 గురు చిన్నారులున్నారు.

Road Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్సుం ప్రాంతంలో ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఐదుగురు చిన్నారులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయి. మృతుల్లో ఓ పోలీస్ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సుంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పిందని, నేరుగా లోయలో పడిపోయిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే అందరూ చనిపోయారు.
#WATCH | Jammu and Kashmir: People of the same family met with a car accident in the Daksum area of Anantnag district. Further details awaited. pic.twitter.com/zDoU7eJqXv
— ANI (@ANI) July 27, 2024
అంతకు ముందు కూడా దొడ జిల్లాలో ఈ తరహా ప్రమాదమే జరిగింది. ఓ బస్ లోయలో పడిపోయిన ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో ఇక్కడ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జులై 21వ తేదీన రాజౌరీలో రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 8 మందితో వెళ్తున్న ట్యాక్సీ చలన్ గ్రామంలో ఓ లోయలో పడిపోయింది. అంతకు ముందు జులై 13న దొడ జిల్లాలో ప్రమాదం జరిగి 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

