Wedding called off: పెంపుడు కుక్క వల్ల పెళ్లాగిపోయింది - గాయలయ్యేలా కొట్టుకున్నారు కూడా!
Pet Dog: వధువు పెంపుడు కుక్కను మండపానికి తెచ్చింది. ఇది వరుడి కుటుంబసభ్యులకు నచ్చలేదు. అంతే తర్వాత పెళ్లాగిపోయింది.

Wedding called off over bride pet dog: ఉత్తరప్రదేశ్‌లో ఒక పెంపుడు కుక్క కారణంగా ఏకంగా పెళ్లి వేడుకే రద్దయి, రక్తపాతానికి దారితీసిన విచిత్ర ఘటన వైరల్ అయింది. సాధారణంగా కట్నకానుకల విషయంలోనో లేదా ఇతర కారణాల వల్లనో పెళ్లిళ్లు ఆగిపోవడం చూస్తుంటాం, కానీ ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఐదుగురు ఆసుపత్రి పాలయ్యేలా చేసింది.
వివాహ వేడుక జరుగుతున్న సమయంలో వధువు తన ప్రాణ సమానమైన పెంపుడు కుక్కను వెంట తెచ్చుకుంది. అయితే, పెళ్లికొడుకు తరపు బంధువులు ఆ కుక్కను మండపం లోపలికి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కుక్కను దూరంగా ఉంచాలని వారు పట్టుబట్టగా, వధువు కుటుంబం దానికి నిరాకరించింది. ఈ చిన్న వాగ్వాదం కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణకు దారితీసింది.
कभी कोई खबर पढ़ने के बाद हंसी भी आती है और तरस भी।
— Uttam Yadav (@UttamYadav_10) February 21, 2026
अब देखो उत्तर प्रदेश के फतेहपुर के सुमित केशरवानी की शादी प्रयागराज की तनु केशरवानी के साथ तय हुई थी दोनों 2 साल से रिश्ते में थे और यह शादी लव मैरेज थी।
दुल्हा बारात लेकर दुल्हन के घर पहुंचा तो वहाँ दुल्हन का पालतू कुत्ता… pic.twitter.com/EkkG7pPwB8
ఈ గొడవ ఎంతటి స్థాయికి వెళ్లిందంటే, ఇరు కుటుంబాల వారు పరస్పరం కర్రలు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ పెనుగులాటలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శుభం జరగాల్సిన పెళ్లి వేడుక కాస్తా అరుపులు, కేకలతో రణరంగంగా మారిపోవడంతో అతిథులంతా అవాక్కయ్యారు.
एक कुत्ते की वजह से टूट गई शादी.....
— Anu Yadav (@Anuyadav007) February 21, 2026
18 फरवरी को प्रयागराज के करनैलगंज से उत्तर प्रदेश के फतेहपुर में बारात आई।
डीजे, द्वार पूजा, जयमाल हुआ और रात करीब 3–4 बजे दूल्हा-दुल्हन सात फेरों के लिए मंडप में बैठे थे, तभी लड़की के घर का पालतू कुत्ता भौंकने लगा और किसी बाराती ने उसे मार… pic.twitter.com/Ye2yfeM4zL
చివరికి, ఈ వివాదం తీవ్రం కావడంతో పెళ్లికొడుకు, వధువు కుటుంబాలు రాజీ పడటానికి నిరాకరించాయి. ఒక చిన్న కుక్క విషయంలో ఇంతటి గొడవ జరిగిన తర్వాత సంబంధం కొనసాగించడం ఇష్టం లేదని ఇరుపక్షాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఒక పెంపుడు జంతువు కారణంగా రెండు కుటుంబాల బంధం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.























