News
News
X

UP Election: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమరంలో ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్థిగా ఫైనల్!

రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సీఎం అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

FOLLOW US: 

ఉత్తర్‌ప్రదేశ్.. దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన రాష్ట్రం. ఇక్కడ విజయం సాధిస్తే దాదాపు కేంద్రంలో అధికారం సాధించినట్లేనని జాతీయ పార్టీలు భావిస్తాయి. అందుకే ఇక్కడ విజయం కోసం కాంగ్రెస్ ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ప్రియాంక గాంధీనే రంగంలోకి దింపింది.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేస్తున్నారు ప్రియాంక. అయితే 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలోనే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందా? అవును కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంక గాంధీ యేనని ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి.

ఆమె నిర్ణయమే!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ప్రియాంక అభ్యర్థిత్వంపై పలువురు కాంగ్రెస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా తాను ఉండాలా లేదా అనేది ప్రియాంక గాంధీ నిర్ణయిస్తారని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.

" రానున్న యూపీ ఎన్నికల్లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోనే మేం పోటీచేస్తాం. అయితే సీఎం అభ్యర్థిగా ప్రియాంక నిల్చొవాలో వద్దో ఆమే నిర్ణయించుకుంటారు.                                 "
-  సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ నేత

అధినేత్రి ఉన్నారుగా..

" మాకు ఇప్పటికే పార్టీకి అధ్యక్షురాలు ఉన్నారు. కనుక ఇంకో అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదు. ఇప్పడున్న నాయకత్వంతో మేం సంతృప్తిగా ఉన్నాం. బయట పార్టీలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయి.                                                   "
-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ నేత

ఎక్కడి నుంచి పోటీ..

ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తోన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే గాంధీ కుటుంబంలో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తిగా ప్రియాంక గాంధీ నిలుస్తారు. జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీ వరకు ప్రతి తరం సభ్యులు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు.

2022 మొదట్లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, భాజపా ప్రచారం మొదలుపెట్టాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను భాజపా 312 చోట్ల విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ పార్టీ 19 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమైంది.

Published at : 19 Sep 2021 12:22 PM (IST) Tags: CONGRESS Uttar Pradesh Election Priyanka Gandhi Vadra UP Chief Minister candidate

సంబంధిత కథనాలు

TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!

TSPSC AE Jobs: తెలంగాణలో 837 ఇంజినీరింగ్ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!

IBPS Clerks Main Exam Admit Card: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, పరీక్ష ఎప్పుడంటే?

IBPS Clerks Main Exam Admit Card: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, పరీక్ష ఎప్పుడంటే?

CM KCR Meets Vijay Darda : సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ విజయ్‌ దర్డా భేటీ

CM KCR Meets Vijay Darda : సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ విజయ్‌ దర్డా భేటీ

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ABP Desam Top 10, 29 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 29 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి  ఐదు ఫీచర్లు!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!