US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్‌న్యూస్
H-1B Visa News: H-1B వీసాలను ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా మార్పులు చేయనున్నారు.
H-1B Visa Renewal:
వర్కింగ్ వీసాల జారీలో మార్పులు..
వర్కింగ్ వీసాల జారీలో అమెరికా కీలక మార్పులు చేయనుంది. పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ (H-1B renewal) చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. H-1B Visasకి ఇది వర్తించనుంది. డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది. భారత్‌కి చెందిన IT ఉద్యోగులకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలోనే ఇందుకు సంబంధించిన చర్చ జరిగింది. H-1B వీసాలను రెన్యువల్ చేయాలంటే ప్రతిసారి భారత్‌కి తిరిగి రావాల్సి వస్తోంది. ఈ శ్రమ లేకుండా అమెరికాలోనే ఆ ప్రాసెస్ పూర్తయ్యేలా చూడాలని భారత్ ప్రతిపాదించింది. ఈ మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి పైలట్ ప్రోగ్రామ్‌గా ఇది మొదలు పెట్టనుంది. అమెరికా వీసాల కోసం భారత్‌లో డిమాండ్ భారీగా ఉంది. కొంత మంది ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించి వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని చూస్తోంది అమెరికా. వీలైనంత త్వరగా వీసాలు లభించేలా సంస్కరణలు చేస్తోంది. డొమెస్టిక్ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్ (domestic visa renewal programme)ద్వారా భారత్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. భారత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రోగ్రామ్‌ని లాంఛ్ చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్లకు డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు 20 వేల వర్కింగ్ వీసాలు జారీ చేయనుంది.
"తొలి విడతలో భాగంగా 20 వేల మందికి వర్కింగ్ వీసాలు జారీ చేయాలనుకుంటున్నాం. వీళ్లలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఆ తరవాత దశల వారీగా ఈ ప్రాసెస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తాం. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో భారతీయ నిపుణులున్నారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నాం. ఇదే సమయంలో కొత్త వీసా అప్లికెంట్స్‌కీ ఈ నిర్ణయం బెన్‌ఫిట్ అవుతుంది"
- వీసా సర్వీసెస్ ప్రతినిధులు
ఎప్పటి నుంచో కసరత్తు..
ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ప్రకటించారు. Ronald Reagan Centre లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడింది. దాదాపు 20 ఏళ్లుగా ఇలాంటి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వలేదు అమెరికా. యూఎస్‌లో ఎన్నో ఏళ్లుగా ఉంటూ వర్కింగ్ వీసాల కోసం భారత్‌కి వెళ్లాల్సిన వాళ్లకు ఇది లబ్ధి చేకూర్చనుంది.
Also Read: సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply