News
News
X

US Gun Death Rate: పిట్టల్లా రాలిపోతున్న అమెరికన్లు, రికార్డు స్థాయిలో మరణాలు - లెక్కలు తేల్చిన రిపోర్ట్

US Gun Death Rate: అమెరికాలో గన్ వయలెన్స్ కారణంగా గతేడాది రికార్డు స్థాయి మరణాలు నమోదయ్యాయని ఓ నివేదిక వెల్లడించింది.

FOLLOW US: 
Share:

US Gun Death Rate:

మూడు దశాబ్దాల రికార్డు..

అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. 2010తో పోల్చితే...కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే మహిళ మూడు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళల సంఖ్య 2015తో పోల్చుకుంటే డబుల్ అయింది. గన్ వయలెన్స్ ద్వారా చనిపోతున్న వారిలో 14% మహిళలే ఉంటున్నారు. గతేడాది లెక్కలు చూస్తే..ప్రతి లక్ష మంది అమెరికన్ మహిళలకు ఏడుగురు తుపాకీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఈ సంఖ్య 4గా ఉంది. 

దారి తప్పిన గన్‌ కల్చర్..

1775 నుంచే అమెరికా సంస్కృతిలో భాగమైపోయాయి తుపాకులు. ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో  అమెరికన్లు తుపాకులు వినియోగించటం మొదలు పెట్టారు. రానురాను తుపాకి అనేది అమెరికా జాతి చిహ్నంగా మారిపోయింది. ఇక్కడే మరో అంశమూ ప్రస్తావించాలి. 1776లో ఇంగ్లాండ్‌తో పోరాటం చేసి స్వాతంత్య్రం  సంపాదించుకుంది అమెరికా. ఆ సమయంలో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. "స్వీయరక్షణ" అనే కారణాన్ని చూపిస్తూ ఇప్పటికీ చాలా మంది లైసెన్స్‌డ్ గన్స్ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల్లో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు అంచనా. మొదట్లో భద్రత కోసం తుపాకి ఉంటే మంచిదని భావించిన అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. రానురాను ఇది ప్రెస్టేజ్ సింబల్‌గా మారింది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్‌ కల్చర్‌ దారి తప్పింది. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్ 2.0 నడుస్తోందని అంటున్నారంతా. 

Also Read: India-US Military Drills: సరిహద్దు ఒప్పందాలనే ఉల్లంఘిస్తారా? భారత్, అమెరికా మిలిటరీ విన్యాసాలపై చైనా గుర్రు

Published at : 02 Dec 2022 11:25 AM (IST) Tags: America US Gun culture US Gun Death Rate Gun Death Rate

సంబంధిత కథనాలు

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

Air India Express flight: ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మంటలు, టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్

Air India Express flight: ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మంటలు, టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్

Elon Musk Twitter: ట్విటర్‌ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!

Elon Musk Twitter: ట్విటర్‌ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!

loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్‌ ఫిగర్‌ చేసిన అదానీ కంపెనీలు

loss in Adani Stocks: కలిసికట్టుగా ₹10 లక్షల కోట్లు - నష్టాన్ని రౌండ్‌ ఫిగర్‌ చేసిన అదానీ కంపెనీలు

Adani Enterprises: అదానీ పరువు అక్కడ కూడా పోయింది - డో జోన్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఔట్‌

Adani Enterprises: అదానీ పరువు అక్కడ కూడా పోయింది - డో జోన్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఔట్‌

టాప్ స్టోరీస్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?