Eric Garcetti: తౌబా తౌబా డాన్సలు - దీపాల వెలుగులు - భారత్‌లో అమెరికా రాయబారి పండగ మాములుగా లేదు !
Diwali party: దీపావళి పండుగ అంటే పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమే. బయట దేశాల వాళ్లకు ఇంకా ఇష్టం. ఎంత ఇష్టమో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి జరుపుకున్న విధానమే ఉదాహరణ.
US Ambassador to India Eric Garcetti Diwali party dance: భారత్‌లో అమెరికా రాయబారి అంటే చాలా పెద్ద పొజిషనే. ఆయన దీపావళి పండుగ కోసం చేసిన హంగామా ఇంతా ఇంతా కాదు. ఏకంగా ఎత్నిక్ వేర్ లో డాన్సులు చేసేశారు. తౌబా తౌబా అంటూ ఆయన చేసిన డాన్సులకు సోషల్ మీడియా బద్దలైపోయింది. అమెరికా రాయబరి డాన్స్‌కు ఫిదా కానివారు లేరు.
#WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi
— ANI (@ANI) October 30, 2024
(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH
హిందూ పండుగలంటే అమితమైన ఆసక్తి చూపించే అమెరికా రాయబారి దీపాలను షేర్ చేస్తూ ఉదయమే ఓ వీడియో షేర్ చేశారు. అది ఆయనకు దీపావళి పండుగపై ఉన్న ఆసక్తిని తెలియచేస్తుంది.
This Diwali, Indians, and Americans across Mission India are sharing these diyas that bring joy and blessings to all. Join us in the festivities as we celebrate the #FestivalofLights with music, dance, festive cheer, and a grateful heart. On behalf of the U.S. Mission in India, I… pic.twitter.com/rptObWHwtr
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) October 31, 2024
దీపావళి పండుగను అమెరికాలోని వైట్ హౌస్ లోనూ ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు కూడా.
What a beautiful celebration of Diwali at the @WhiteHouse! As we celebrate the journey of light, we also honor the invaluable contributions of Indian Americans who deepen the #USIndia bond. From New Delhi to D.C., may the light of Diwali illuminate every corner of the world and… https://t.co/1CEjRwhptQ
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) October 30, 2024
చాలా మంది రాయబారులు దేశంలోని ప్రధానమైన హిందూ పండుగల్లో పాల్గొంటారు కానీ ఎరిక్ గార్సెట్టీ మాత్రం ప్రత్యేకం. ఆయన లీనమైపోతారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో కలిసిపోవాలనుకుంటారు. ఆయన చేసిన డాన్సే దానికి సాక్ష్ష్యం. సాధారణంగా అమెరికా నుంచి రాయబారులుగా వచ్చిన వారు కాస్త టెక్కు చూపిస్తారు. కానీ గార్సెట్టీ మత్రం ఇండియన్స్ తో కలిసిపోతున్నారు.