అన్వేషించండి

Viral News: కెమెరా కారులో తిరుగుతూంటే దొంగలని కొట్టిన గ్రామస్తులు - గాయాలపాలైన గూగూల్ మ్యాప్స్ టీం

Attack On Google Maps Team: దొంగలని అనుకుని గూగుల్ మ్యాప్స్ టీమ్‌ను యూపీ గ్రామస్తులు కొట్టారు. గూగుల్ కోసం వారు రోడ్లను మ్యాపింగ్ చేస్తున్నారు.

UP villagers beat up Google Maps team:  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని బిర్హార్ గ్రామంలో గూగుల్ మ్యాప్స్ సర్వే బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గూగుల్ మ్యాప్స్ కోసం రోడ్లను మ్యాపింగ్ చేసేందుకు వచ్చిన ఈ బృందాన్ని గ్రామస్తులు దొంగలుగా అనుమానించి దాడికి దిగారు. ఈ సంఘటనలో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 
గూగుల్ మ్యాప్స్ సర్వే  పనిని టెక్ మహీంద్రాకు ఔట్ సోర్స్చేశారు.  ఈ బృందం, బిర్హార్ గ్రామంలో రాత్రి వేళలో కెమెరా-మౌంటెడ్ వాహనంతో రోడ్లను ఫోటోలు తీస్తూ మ్యాపింగ్ చేస్తోంది. ఈ వాహనంపై రూఫ్‌టాప్ కెమెరా ఉండటం గ్రామస్తులకు అనుమానాస్పదంగా అనిపించింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో కార్లలో వచ్చే వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు జరిగాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు.

గూగుల్ మ్యాప్స్ బృందం గ్రామంలో ఫోటోలు తీస్తుండగా, గ్రామస్తులు వారి వాహనాన్ని అడ్డుకొని ప్రశ్నించారు. వారు చోరీ కోసం సమాచారం సేకరిస్తున్నారని అనుమానించి, కొంతమంది గ్రామస్తులు  సభ్యులపై దాడి చేశారు. పరిస్థితి తీవ్రమవుతుండగా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్‌లో గూగుల్ మ్యాప్స్ బృందం తాము దొంగలు కాదని, గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ కోసం రాష్ట్ర డీజీపీ అనుమతితో సర్వే చేస్తున్నామని వివరించారు.  స్థానికులు కూడా తమ గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనాల కారణంగా అప్రమత్తంగా ఉన్నామని, అపరిచిత వాహనాలపై అనుమానం కలిగిందని పోలీసులకు వివరించారు. అసలు విషయం తెలిసిన తర్వాత గ్రామస్తులు శాంతించారు.   గూగుల్ మ్యాప్స్ బృందంతో పాటు గ్రామస్తులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఎటువంటి చట్టపరమైన సమస్య లేకుండా గ్రామస్తులను పంపించారు.                                              

గూగుల్ మ్యాప్స్ సర్వే బృందం అనుమతితో పని చేస్తోందని తెలిసిందని అందుకే ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పోలీసులు ప్రకటించారు.  స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా ఇలాంటి దాడులను నివారించవచ్చని పోలీసులు సలహాలు ఇచ్చారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Affordable 7 Seater Cars: బడ్జెట్ ధరలో 7 సీటర్ కార్లు.. వాటి ధర, ఫీచర్లు చూశాకే డిసైడ్ చేసుకోండి
బడ్జెట్ ధరలో 7 సీటర్ కార్లు.. వాటి ధర, ఫీచర్లు చూశాకే డిసైడ్ చేసుకోండి
India Lockdown: భారత్‌లో లాక్‌డౌన్ విధింపు ! కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కీలక వ్యాఖ్యలు
భారత్‌లో లాక్‌డౌన్ విధింపు ! కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కీలక వ్యాఖ్యలు
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget