అన్వేషించండి

Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?

Online Job Fraud : మీ కోసం ఉద్యోగం రెడీగా ఉంది అని ఫోన్ చేస్తే ఆ నిరుద్యోగ యువకుడు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ కోసం చూస్తూంటే రూ. 250 కోట్లు కట్టాలని జీఎస్టీ నోటీసు వచ్చింది.

UP man receives Rs 250 crore GST bill :  ఉత్తరప్రదేశ్‌లోని రత్నపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బిర్సు అనే గ్రామం ఉంది. అన్ని గ్రామాల్లోలాగే అక్కడి యువకులు కూడా ఏదో ఓ ఉద్యోగం దొరుకకపోతుందా అని తిరుగుతూ ఉంటారు. ఇలా అశ్వనీకుమార్ అనే యువకుడు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ రోజు అతనికి వాట్సాప్ కాల్ వచ్చింది. మీలాంటి వాళ్ల కోసమే మేము చూస్తున్నామని ఉద్యోగం రెడీగా ఉందని ఆఫర్ ఇచ్చారు. పాతిక వేల జీతం.. ఐదురజుల పని ఇలా చాలా చెప్పారు. దీంతో మహేశ్ కుమార్ తన కష్టాలన్నీ తీరిపోయాయనుకున్నారు. వారు అడిగినట్లుగా కరెంట్  బిల్లు, తన తండ్రి ఆధార్ కార్డు ఇచ్చాడు. అంతే కాదు రిజిస్ట్రేషన్  ఫీజు పేరుతో రూ. 1750  అడిగితే అవి కూడా ఇచ్చాడు. 

ఇక తనకు ఆఫర్ లెటర్ వాట్సాప్ లోనే వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆఫర్ లెటర్ రాలేదు. కానీ ఓ రోజు పోస్టు మ్యాన్ మాత్రం ఓ కవర్ తెచ్చి ఇచ్చిపోయాడు.  వాట్సాప్ లో కాకుండా నేరుగా ఆఫర్ లెటర్ పంపారేమో అనుకుని అశ్వనీకుమార్ ఆత్రంగా చూశాడు కానీ.. అతనికి మైండ్ బ్లాంకైపోయింది. ఎందుకంటే.. రూ.250 కోట్లు జీఎస్టీ కట్టాలని వచ్చిన డిమాండ్ నోటీసు అది. ఆ నోటీసును చూసి అశ్వనీకుమార్ కు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ అప్పుడు తనకు గుర్తుకు వచ్చింది..తనకు జాబ్ పేరుతో ఆఫర్ చేసి..  ఆధార్ కార్డులు, తన ఇంటి కరెంట్ బిల్లులు తీసుకున్నారని. 

మద్యం మత్తులో జార్జియాకు బదులు ఇండియా ఫ్లైటెక్కేసింది - యువతి నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్

అలా తీసుకున్న వారు అశ్వనీకుమార్ కు ఎలాంటి జాబ్ ఇవ్వకపోగా.. ఆయన తండ్రి పేరు మీద ఓ కంపెనీని రిజిస్టర్ చేశారు. వందల కోట్ల లావాదేవీలు నిర్వహించారు. కానీ ఒక్క రూపాయి జీఎస్టీ కట్టలేదు. దాంతో జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. రిజిస్టర్డ్ అడ్రస్ కూడా సొంత గ్రామంలో ఉండటంతో అదే అడ్రస్ కు పంపించారు. ఈ నోటీసులు చూసి అశ్వనీకుమార్ లబోదిబోమంటున్నాడు.  ఆలస్యం చేస్తే తనను జైల్లో వేస్తారన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనికి వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

నడిరోడ్డుపై రేప్‌ - వీడియో తీస్తూ చూసిన జనం - మధ్యప్రదేశ్‌లో ఘోరం

ఆన్ లైన్ ఫ్రాడ్ చేసేందుకు ఇలాంటి కంపెనీలను సృష్టించి ... బినామ ఈ వేబిల్లులు క్రియేట్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆన్ లైన్ ఫ్రాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అంటున్నారు. ఆన్ లైన్ ఫ్రాడ్ చేసే వాళ్లకు.. ముక్కూ ముఖం  తెలియని వాళ్లకు ఇలా ఆధార్ కార్డుల డీటైల్స్ ఇస్తే.. ఇలాంటి పరిస్థితులే వస్తాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.                                           

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget