Top Headlines Today: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిర్మలమ్మ వరాలు, ఆర్థిక సర్వేలో హరీష్ నియోజకవర్గ ప్రస్తావన- నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today | కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ప్రవేశపెట్టింది.

Top Telugu Headlines Today: AP Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిర్మలమ్మ వరాలు - అమరావతికి భారీగా ఆర్థిక సాయం
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Niramala Sitharaman) ఏపీకి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అమరావతి (Amaravathi) అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
2023-24 ఆర్థిక సర్వేలో హరీష్ నియోజకవర్గ ప్రస్తావన- సిద్దిపేట స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్‌కు ప్రశంసలు
సిద్దిపేట నియోజకవర్గం ఖ్యాతి మరోసారి దేశ స్థాయిలో మార్మోగిపోయింది. ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయంగా సిద్ధిపేటలో రూపొందించిన స్టీల్ బ్యాంక్ విధానంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆర్థిక సర్వే నివేదికలో సిద్దిపేటలో అమలు చేస్తున్న స్టీల్ బ్యాంక్ విధానంపై ఆమె ప్రస్తావించారు. పునర్వినియోగించలేని ప్లాస్టిక్ వ్యర్థాల నేపథ్యంలో సిద్దిపేట వాసుల సరికొత్త సృజనాత్మక ఆలోచనను పార్లమెంట్‌లో ఎకనమిక్ సర్వే నివేదిక ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధానికి గోల్డెన్ డేస్ - ఇక పరుగులు పెట్టనున్న అమరావతి నిర్మాణం !
అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. అలా ఇలా కాదు ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగిపోయిన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకోనున్నాయి. పరిపాలనా నగరానికి ఓ రూపు రావడానికి రాష్ట్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సాయం అందనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీకి బడ్జెట్‌లో కేటాయింపులపై సంతృప్తి - కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్‌కు బడ్దెట్‌లో ప్రాధాన్యం దక్కింది. అమరావతికి రూ. పదిహేను వేల కోట్లు ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరానికి పెట్టే ప్రతి ఖర్చు నాబార్డు ద్వారా రీఎంబర్స్ చేస్తారు కాబట్టి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎంత మొత్తం అని చెప్పలేదు. ఇంకా ఏపీకి పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించారు. ఈ కేటాయింపులపై టీడీపీ నేతలు సంతృప్తి ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

