Vladimir Putin: 'ఉక్రెయిన్- రష్యా యుద్ధం అయ్యేసరికి పుతిన్ కథ ముగిసిపోతుంది'
Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగిసేసరికి వ్లాదిమిర్ పుతిన్ తన అధికారాన్ని కోల్పోతారని ఉక్రెయిన్ పేర్కొంది.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పుతిన్‌ను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు ఇప్పటికే రష్యాలో మొదలయ్యాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరైలో బుదనోవ్ తెలిపారు.
అదే లక్ష్యం
ఖెర్సాన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తోందని ఆయన అన్నారు.
పుతిన్
అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భూభాగాలను కాపాడుకొనేందుకు తనకు ఉన్న దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ అంతకుముందు హెచ్చరించారు.
"ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "
Also Read: Viral Video: స్నేహమంటే ఇదేరా! కాకిని కాపాడిన ఎలుగుబంటి!