![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Viral Video: స్నేహమంటే ఇదేరా! కాకిని కాపాడిన ఎలుగుబంటి!
Viral Video: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![Viral Video: స్నేహమంటే ఇదేరా! కాకిని కాపాడిన ఎలుగుబంటి! Viral Video: Bear Saving Drowning Crow At The Budapest Zoo Goes Viral Viral Video: స్నేహమంటే ఇదేరా! కాకిని కాపాడిన ఎలుగుబంటి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/30/9d6346ab5e51e32fba2be7c89da3898a1667126894141218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral Video: క్రూర జంతువులు కూడా ఒక్కోసారి జాలి చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడింది.
ఇదీ సంగతి
హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఈ ఘటన జరిగింది. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుస్తుంది. ఇది గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లింది.
నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటిని చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి రక్షించింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను ఎలుగుబంటి పట్టుకుని బయటకు తీసింది. ఆ తర్వాత ఎలుగుబంటి ఆహారం కోసం మరో చోటుకు వెళ్లింది. కొద్ది సేపటికి కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది.
Footage from Aleksander Medveš shows Vali, a bear at the Budapest Zoo, saving a drowning crow.pic.twitter.com/KbHNhkeiOI
— Fascinating (@fasc1nate) October 28, 2022
వైరల్ వీడియో
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని ప్రాణాలతో కాపాడిన ఎలుగుబంటికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)