By: ABP Desam | Updated at : 15 Feb 2022 02:12 PM (IST)
Edited By: Murali Krishna
భారతీయులకు కేంద్ర అలర్ట్
రష్యా- ఉక్రెయిన్ మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా విద్యార్థులు తాత్కాలికంగా తక్షణం స్వదేశానికి తిరిగిరావాలని పేర్కొంది.
ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని తెలిపింది.
ఈనెల 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్స్ పేర్కొంది. దీంతో ఉక్రెయిన్‌లో ఉంటోన్న తమ పౌరులను స్వదేశానికి రావాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. భారత్ కూడా ఇందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
ఆక్రమణ తప్పదా
చర్చలకు ఓకే అంటూనే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈనెల 16న రష్యా తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అన్నారు.
సరిహద్దులో
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రస్తుతం వాతావరణం ఉత్కంఠగా ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసేలోపు రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ నుంచి తన బలగాలను, సిబ్బందిని అమెరికా తిరిగి రప్పించుకుంటోంది. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేయనున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో ఖండిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడి గురించి మాత్రం రష్యా స్పష్టత ఇవ్వట్లేదు.
Also Read: Sansad TV Hacked: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్- సర్కార్ సంగతే ఇలా ఉంటే సామాన్యుడి గతేంటో!
Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Akhilesh On Temples : ఓ రాయి, ఎర్రజెండాను రావిచెట్టు కింద పెడితే చాలు గుడి రెడీ - ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Breaking News Live Updates : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న పెన్నానది
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!