17th child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ - ఇందులో అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే !
Woman gives birth to 17th child: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ మహిళ పదిహేడో బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ..ఆమె కుటుంబం చెత్త ఏరుకుంటూ బతుకుతుంది.

Udaipur woman gives birth to 17th child family collects scrap to survive: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 55 ఏళ్ల మహిళ రేఖా గల్బేలియా 17వ సంతానానికి జన్మనిచ్చింది. ఈ మహిళ గతంలో 16 మంది సంతానాన్ని కనగా, వారిలో నలుగురు కొడుకులు , ఒక కుమార్తె పుట్టిననప్పుడే మరణించారు. ఆమె జీవించి ఉన్న 12 మంది సంతానంలో ఐదుగురు వివాహమై, సొంత కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరి కుటుంబం ఏం చేసి బతుకుతుందంటే.. చెత్త సేకరించి బతుకుతుంది.
నిజానికి ఇప్పుడు ఒక్క బిడ్డను పెంచడానికి యువత భయపడుతున్నారు. కానీ వీరు మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. ఇంతమంది సంతానాన్ని కనడం విని అందరూ ఆశ్చర్యపోతున్నారని.. ఆ భార్యభర్తలు చెబుతున్నారు. మా పిల్లలను పోషించడానికి 20 శాతం వడ్డీతో సొమ్ము అప్పు తీసుకోవాల్సి వచ్చిందని.. లక్షల రూపాయల అప్పు తీర్చినా, వడ్డీ ఇంకా పూర్తిగా చెల్లించలేదని ఆ తండ్రి వాపోతున్నారు. కుటుంబం స్క్రాప్ సేకరణ ద్వారా జీవనం సాగిస్తుండటంతో, పిల్లలకు విద్యను అందించలేకపోతున్నారు.
55 साल की उम्र में 17वें बच्चे को किया पैदा
— ऑपइंडिया (@OpIndia_in) August 27, 2025
डॉक्टर से कहा- ये सिर्फ चौथी डिलीवरी
उदयपुर का मामला
कबाड़ बीनकर कट रही पूरे परिवार की जिंदगीhttps://t.co/NbvScLher2 pic.twitter.com/sN3P0eOMC9
రేఖాను ఆసుపత్రిలో చేర్చినప్పుడు, ఇది ఆమె నాల్గవ సంతానం అని కుటుంబం చెప్పింది. తర్వాత ఇది ఆమె 17వ సంతానం అని తేలిందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర పేదరికం మరియు ప్రభుత్వ పథకాల అమలులోని లోపాలను బయటపెట్టింది. ఉదయపూర్ జిల్లా అధికారులు ఈ కుటుంబం యొక్క ఆర్థిక మరియు గృహ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఝడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రేఖా , నవజాత శిశువుకు అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తోంది.
राजस्थान के उदयपुर जिले में एक 55 वर्षीय
— Sanjay Gupta 🇮🇳 (@sanjukgupta1987) August 27, 2025
महिला ने अपने 17 वे बच्चे को जन्म दिया है,
महिला का पति बोला - हम लोग बहुत गरीब हैं, रहने को घर नहीं है..😂😂 pic.twitter.com/DgFotR927Q
కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడంతో పాటు వీరు పిల్లలను దేవుడు ఇస్తున్నాడని వద్దనడానికి తాము ఎవరం అన్న అభిప్రాయంలో ఉండిపోతున్నారు. ఈ కారణంగానే వారు ఇలా పిల్లల్ని కంటూ పోతున్నారని అనుమానిస్తున్నారు.
राजस्थान उदयपुर की रेखा कालबेलिया ने 55 साल की उम्र में 17 वें बच्चे को जन्म देकर दुर्लभ उपलब्धि हांसिल की है।
— Akhilesh Yadav (@byakhileshyadav) August 27, 2025
इसका क्रेडिट बच्चों की माँ को जायेगा या पिता को ? pic.twitter.com/qaX10vxFVL





















