News
News
X

Adhar PVC : అలాంటి ఆధార్ కార్డులన్నీ నకిలీవే.. కీలక ప్రకటన చేసిన ఉడాయ్!

ఆధార్ పీవీసీ కార్డుల్ని బయట సంస్థల నుంచి తీసుకోవద్దని .. అలాంటివన్నీ నకలీవేనని ఉడాయ్ హెచ్చరించింది. పీవీసీ ఆధార్ కార్డుల్ని ఆధార్ సంస్థ నుంచి మాత్రమే పొందాలని సూచించింది.

FOLLOW US: 

ఆధార్ లేనిదే ఇప్పుడు ఏ ఆధారం దొరకని పరిస్థితి. అందుకే అందరూ ఆధార్ కార్డుని సురక్షితమైన పద్దతిలో ఉంచుకోవాలనుకుంటున్నారు. ఇటీవల పీవీసీ ఆధార్ పాపులర్ అయింది. పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్‌గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీనిన్ నీటిలో వేసిన కూడా తడవదు.

Also Read: "ఆధార్" డీటైల్స్ ప్రభుత్వానికి ఇస్తారా? లేదా ? త్వరలో మీకో ఫామ్ రాబోతోంది..! ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?

అయితే ఉడాయ్ మాత్రమే కాదు.. ప్రైవేటు సంస్థలు కూడా ఈ ఆధార్ పీవీసీ కార్డులను ఇస్తున్నారు. దీనిపై ఉడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని స్పష్టం చేసింది.

Also Read: మీరు "మాస్క్ ఆధార్" పొందారా ? దీని గురించి వినలేదా? వెంటనే తెలుసుకోండి.. డౌన్ లోడ్ చేసుకోండి...

బయట సంస్థలు తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది. కాబట్టి ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోవద్దని ప్రజలకు సూచించింది. పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్‌ చేసింది. ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. 

Also Read: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

యూఐడీఏఐ వెబ్​సైట్​(https://myaadhaar.uidai.gov.in/) లో  'ఆర్డర్​ ది పీవీసీ కార్డ్' ఆప్షన్‌ను క్లిక్ చేసి.. వివరాలు నింపి..  రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్​ కార్డులో ఉన్న అడ్రెస్​కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. బయట వ్యక్తుల నుంచి తీసుకుంటే ఆ ఆధార్ కార్డు పని చేయదు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Jan 2022 03:18 PM (IST) Tags: Aadhaar News Aadhaar Card UADAI Aadhaar PVC card. Fake Aadhaar PVC

సంబంధిత కథనాలు

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

పండగొచ్చేసింది - 78 రోజుల బోనస్, పేదలకు రేషన్ ఫ్రీ- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

పండగొచ్చేసింది - 78 రోజుల బోనస్, పేదలకు రేషన్ ఫ్రీ- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు!

పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు!

టాప్ స్టోరీస్

YSRCP WorkShop : ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ - నేరుగా ఇచ్చేసిన జగన్ ! వారెవరంటే ?

YSRCP WorkShop :  ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ -  నేరుగా ఇచ్చేసిన జగన్ !   వారెవరంటే ?

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

AP Vs Telangana :  విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్

Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్