Breaking News Live:ప్రేమ విఫలమైందని పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
AP Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
Telangana Breaking News Live Updates: కరోనా వ్యాప్తితో చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటి నుంచి పునః ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. నిన్న ఏపీలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు తూర్పు దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు అలాగే ఉంటాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత మరికొన్ని రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు దట్టంగా కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.
వరుసగా వారం రోజులు పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.550 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 అయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.1,200 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.68,600 కు ఎగబాకింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. విజయవాడలో రూ.510 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 15th February 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,500 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300కి పతనమైంది. విజయవాడలో వెండి 1 కేజీ ధర రూ.68,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉంది.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. 19 పైసలు పెరగడంతో వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.31 కి తగ్గింది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 15th February 2022)పై 22 పైసలు తగ్గడంతో నేడు లీటర్ ధర రూ.110.29 కాగా, ఇక్కడ డీజిల్ పై 23 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.36 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
ప్రేమ విఫలమైందని పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
తిరుపతి కొర్లగుంటలో ప్రేమ విఫలం కావడంతో ప్రేయసి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానికులను ఆందోళనకు గురి చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న యువకుడిని చూసి మంటలను స్థానికులు అదుపు చేశారు. బాధితుడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సగానికి పైగా శరీరం కాలి పోవడంతో యువకుడి పరిస్ధితి విషమంగా ఉంది. యువకుడు వివరాలు తెలియాల్సి ఉంది..
Kadapa News: కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ
కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఒంగోలు జైలర్‍గా పంపించింది. కడప జైలర్‍గా ఒంగోలు జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ నియమించింది.
Viveka Murder Case: చెప్పినట్టువినాలని సీబీఐ వేధిస్తోంది, కడప అదనపు ఎస్పీకి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు
వివేకా హత్య కేసు అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ మహేష్ కుమార్ కలిశారు. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఉదయ్ కుమార్ రెడ్డి. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సిబిఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తల్లికూతుర్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా రైల్వేస్టేషన్ మార్గంలో తల్లి, కూతురుపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. ఇనుప రాడ్ తో బలంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు. స్థానికులు ఆటో సహాయంతో టెక్కలి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. జండా పేట గ్రామానికి చెందిన యమున, తల్లి తిప్పన జగదంబ ఉదయం 8 గంటలకు పలాసలో ఉన్న తమ బంధువులు ఇంటికి వెళ్లాలని బస్ ఎక్కేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఇనుప రాడ్ తో దాడి చేసి ఇద్దరి వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగులు, సెల్ ఫోన్లు తీసుకొని పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kishan Reddy On KCR: పాకిస్తాన్ కంటే దిగజారి కేసీఆర్ మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి
Kishan Reddy Criticises Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పాకిస్తాన్ కంటే దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు లేరని.. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి శత్రువులు కేవలం పాకిస్తాన్ మాత్రమే అన్నారు. తమకు రాజకీయ పార్టీలు శత్రువులు కావని, కేవలం ప్రత్యర్థులు మాత్రమే అని పేర్కొన్నారు. మాపైన సర్జికల్ స్ట్రక్ జరిగిందని పాకిస్తాన్ స్వయంగా చెప్పిందన్నారు. దీనిపై వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సైనికులను అవమన పరిచే తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయని చెప్పారు. సైనికుల ఆత్మవిశ్వాసన్నీ దెబ్బతీసేవిధంగా కేసీఆర్ మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.