అన్వేషించండి

racist Trump: అమెరికా రాజ్యాంగాన్ని గురి పెట్టిన ట్రంప్ - భారత్, చైనాల పేరుతో మార్చేయాలనుకుంటున్నారా?

Trump reposts racist rant: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అందు కోసం భారత్ , చైనాల నుంచి వస్తున్న వలసలను కారణంగా చూపిస్తున్నారు.

Trump reposts racist rant against India and China :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అందు కోసం భారత్ , చైనాల నుంచి వస్తున్న వలసలను కారణంగా చూపిస్తున్నారు. 
 వలసదారులపై, ముఖ్యంగా భారత్ , చైనాల నుండి వచ్చే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు లభించే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తన  ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పొడవైన లేఖను రీ-షేర్ చేస్తూ, భారత్‌ను పరోక్షంగా  నరకం తో పోల్చినట్లుగా ఉన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.

ట్రంప్ పంచుకున్న ఆ లేఖలో,  భారత్, చైనా లేదా ఇతర  నరకం  లాంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి బిడ్డకు జన్మనివ్వగానే ఆ పసికందుకి వెంటనే పౌరసత్వం లభిస్తోంది. ఆ తర్వాత వారు తమ మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల అమెరికా తన జాతీయ గుర్తింపును కోల్పోతోందని, ఇప్పుడు అమెరికా వీధుల్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు కరువయ్యారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐరిష్, ఇటాలియన్ ప్రజలు అమెరికాలో కలిసిపోయేవారని, కానీ ప్రస్తుత వలసదారులకు దేశం పట్ల విధేయత లేదని విమర్శించారు.

కేవలం పౌరసత్వంపైనే కాకుండా, అమెరికాలోని టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యంపై కూడా ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌లు చేశారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని టెక్ కంపెనీల్లో నియామక ప్రక్రియ మొత్తం భారతీయులు, చైనీయుల చేతుల్లోనే ఉందని, అక్కడ శ్వేతజాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని ఆరోపించారు.  నేను గతంలో భారతీయులకు పెద్ద మద్దతుదారుడిని, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కళ్లు తెరిచి చూస్తున్నాను అని వ్యాఖ్యానించejg. 

ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, 2025 జనవరిలో ట్రంప్ జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును  సమర్థించుకోవడమే. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు , తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇవ్వకూడదనేది ట్రంప్ లక్ష్యం. ప్రస్తుతం ఈ అంశం అమెరికా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని చట్టం చెబుతుండగా, ట్రంప్ మాత్రం దానిని మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.   

ఈ పరిణామాలు అమెరికాలోని భారతీయ సంతతి వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాలపై ఉండి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి పిల్లల భవిష్యత్తుపై ఈ వ్యాఖ్యలు కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ నిపుణులను కూడా ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget