Top Headlines Today: త్వరలోనే సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి- బీఆర్ఎస్‌తో పొత్తుకు మాయావతి అంగీకారం
AP Telangana Latest News 10 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? జగనన్నని ఏమని పిలవాలో - షర్మిల ఘాటు వ్యాఖ్యలు
బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఏపీకి ఏం చేయలేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్న బీజేపీ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లల్లో ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీలో కోటి ఉద్యోగాలు రావాల్సి ఉందని.. ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అందరినీ మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబు మంచోడు, లోకేష్ అంత మంచోడు కాదు - కేశినేని చిన్ని సంచలనం
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయఢంకా మోగించడం ఖాయం అని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. విజయవాడ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలు క్లిన్ స్వీప్ చేస్తామని అన్నారు. తాను ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య - చెత్తబుట్టలో మృతదేహం లభ్యం
ఆస్ట్రేలియాలోని (Australia) విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్‌శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా (Victoria) రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే చైతన్య భర్త అశోక్ రాజ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. వారి ఇంటికి 86 కి.మీ దూరంలోని చెత్తబుట్టలో ఆమె మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులు' - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి
రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులని బీజేపీ (Bjp) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. టీడీపీ - జనసేనతో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆదివారం ఆమె పొత్తులపై స్పందించారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషకరమని.. రాష్ట్రంలో అరాచక అంతానికి అందరూ కలవాలని ఆమె పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై వీడిన సందిగ్ధత, మాయావతి అంగీకారంతో లైన్ క్లియర్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తులకు రెడీ అవుతున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, ఒడిశా నుంచి బీజేడీ ఎన్డీయేలో చేరగా.. బీఎస్పీ కూడా కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు సిద్దమవుతోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ (BRS)తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR)తో భేటీ అయిన తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడంతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి