Tonga Volcano Eruption: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్
సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. సమీప దేశాల ప్రజలను భయాందోళనలకు గురించేసింది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
అగ్నిపర్వతాలు ఎప్పుడు ఎలా పేలుతాయో తెలీదు. కొన్ని వందల ఏళ్లు.. నిశబ్దంగా ఉండే పర్వతాల్లో ఒక్కోసారి అకస్మాత్తుగా ఉనికిలోకి వస్తాయి. సమీప ప్రాంతాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అవిగానీ పేలితే భారీ విధ్వంసం తప్పదు. నిప్పులు కక్కే లావా ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. అయితే, ఇప్పటివరకు మనం భూమిపై ఎగసిపడే అగ్నిపర్వతాలను మాత్రమే చూశాం. ఇదే విధ్వంసం సముద్ర గర్భంలో చోటుచేసుకుంటే ఎలా ఉంటుందో చూడలేదు. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలోని తోంగా దీవుల సమీపంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతం పేలింది.
సముద్రంలో చిన్న అలజడి ఏర్పడినా ప్రమాదమే. అలాంటిది శనివారం సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలింది. ఇంకేముంది.. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న తొంగాపై సునామీ విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని నగరం.. నుకుఅలోఫా(Nuku'alofa)లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. స్థానిక చర్చితోపాటు.. కొన్ని ఇళ్లు నీటిలో చిక్కుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘హుంగా టోంగా-హంగా హావుపై’ (Hunga Tonga-Hunga Haʻapai) అనే అగ్నిపర్వతం సముద్ర గర్భంలో ఉండటం వల్ల దాని ఉనికిని కనిపెట్టలేకపోయారు. ఆ దేశపు ప్రధాన దీవి తోంగతాపులోని నుకుఅలోఫాకు కేవలం 65 కిమీల దూరంలోనే ఉంది. దీంతో అగ్నిపర్వతం పేలుడుకు సముద్రపు నీరు అలజడికి గురై.. ఆ నగరాన్ని ముంచెత్తాయి. ఆ భారీ శబ్దాన్ని విని అంతా.. స్థానిక ప్రజలు బాంబు పేలుడని భావించారు. సునామీ హెచ్చరికలు రాగానే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు.
Also Read: రాత్రికి రాత్రి వింతగా మారిపోయిన ఇసుక.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఫొటోలు వైరల్
అగ్నిపర్వతం పేలిన తర్వాత భారీ ఎత్తున దుమ్మూ, దూళి గాల్లోకి లేచాయి. రాళ్లు ఎగిరి నగరంలో పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. బూడిద మొత్తం సమీప దీవులను మేఘాల్లా కమ్మేసింది. ఆ పేలుడు శబ్దం.. 2 వేల కిమీల దూరంలో ఉన్న న్యూజిలాండ్ ప్రజలకు సైతం వినిపించిందంటే.. అది ఏ స్థాయిలో బద్దలైందో అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వతం విస్పోటనం తర్వాత అమెరికాకు చెందిన సమోవా దీవికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తొంగా జియోలాజికల్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 8 నిమిషాలపాటు పేలుళ్లు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పడిన బూడిద, గ్యాస్.. సుమారు 20 కిమీలు విస్తరించింది. ఈ దృశ్యాలు శాటిలైట్(ఉపగ్రహం)లో కూడా స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వీడియోలను ఈ కింది ట్వీట్లో చూడండి:
Tonga's Hunga Tonga volcano just had one of the most violent volcano eruptions ever captured on satellite. pic.twitter.com/M2D2j52gNn
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022
Tonga’s Hunga Tonga volcano erupted early this morning sending out a massive shock wave captured on satellite pic.twitter.com/0CJH6R1VYZ
— Latest in space (@latestinspace) January 15, 2022
Tonga's Hunga Tonga volcano a few hours ago - same as lrt but much higher resolution pic.twitter.com/1DShTp7Es1
— pipeline staller (@iximeow) January 15, 2022
Check out the scale of the volcanic eruption of Tonga's Hunga Tonga - Check out the bottom right of the planet #geography #geographyteacher #volcano #tonga #science #space pic.twitter.com/9wXAC0TKK3
— Geography made easy (@easygeography) January 15, 2022
🌊⚠️🌋 #Tsunami warning for #Tonga as underwater #volcano erupts
— ♆ABYSS ℭ 𝔥 𝔯 𝔬 𝔫 𝔦 𝔠 𝔩 𝔢 𝔰 (@AbyssChronicles) January 14, 2022
📰 https://t.co/ZMWyCrRkNW#HungaTongaHungaHaapai#eruption
Fri Jan 14 2022
🔱 ABYSS ℭ 𝔥 𝔯 𝔬 𝔫 𝔦 𝔠 𝔩 𝔢 𝔰 | 𝙳𝚘𝚘𝚖 𝙽𝚎𝚠𝚜 pic.twitter.com/9LWzBuKIjK
Tsunami videos out of Tonga 🇹🇴 this afternoon following the Volcano Eruption. pic.twitter.com/JTIcEdbpGe
— Jese Tuisinu (@JTuisinu) January 15, 2022
This is the moment tsunami waves crash into Tonga, after an underwater volcano erupted earlier on Saturday.
— 1News (@1NewsNZ) January 15, 2022
👉 Keep up with the 1News LIVE updates on this developing story: https://t.co/GRqRXeuqhV pic.twitter.com/kBG7nxSj51
The eruption sent shockwaves all over. In this video you can even hear it blow by these people. Looks like they took the initiative to run to hopefully higher ground 🇹🇴#Volcano #Tonga #HungaTonga #HungaTongaHungaHaapai #underwater #Tsunami #Tonga #Oceania #MotherNature pic.twitter.com/2ynSVNHsXW
— Journalist Siraj Noorani (@sirajnoorani) January 15, 2022
Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’..
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి