Top 10 Headlines Today


 


ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసి కొడతాం: నాగబాబు 


జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను ఇకనుంచి ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసి కొడతామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెట్టి పోటీ ఇవ్వనుందన్నారు. భవిష్యత్తులో టిడిపి, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుందన్నారు. కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించడం లేట్ అయిందని, జన సైనికులకు ఓ మోరల్ సపోర్ట్ ఇస్తున్నామని, గ్రౌంట్ లెవల్ లో ఇష్యూస్ పై చర్చించామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రాజయ్య యూ టర్న్


జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందు మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసిపోయినట్లే కనిపించిన రాజయ్య, తాజాగా మాట మార్చేశారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం వడ్డిచర్లలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం రాజయ్య మాట్లాడారు. కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని,. బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని, గెలుపు కూడా తనదేనని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని సీఎం కేసీఆర్ 115 టికెట్లు కేటాయించారని రాజయ్య అన్నారు.  అభ్యర్థులను ప్రకటించినా ఎవరికి బీ ఫామ్ లు ఇవ్వలేదన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీసీలకు సీట్లు సంఖ్య పెంచాలి: మధుయాష్కీ


తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు 34 సీట్లు ఇవ్వాలని  కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాంధీ భవన్ లో బీసీ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షెట్కర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వెంకటస్వామి పాల్గొన్నారు. బీసీలకు సీట్లు కేటాయింపు అంశంపై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు.  సోమవారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుస్తానని మధుయాష్కీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రోడ్ కం రైల్ వంతెన మూసివేత 


సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం మూసివేయాలని నిర్ణయించారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ - తూర్పు గోదావరి జిల్లా - సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులతో పాటు వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లకు మరమ్మతులు చేయనున్నారు. దాంతో నెల రోజులపాటు రోడ్ కం రైల్ బ్రిడ్జి మూసివేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి కంచె


మణిపూర్‌లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్  చర్చలు జరిపారు. మయన్మార్ సరిహద్దులో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. మణిపూర్ కు మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అమలులో ఉన్న స్వేచ్చాయుత రాకపోలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


శ్రీమతి పరిణిత చోప్రా


బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24 రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో వీరి కోసం ప్రత్యేకమైన విడిది ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


గిల్‌ రికార్డులు 


టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది చాలా పరుగులు చేస్తున్నాడు. దీంతోపాటు ఎన్నో భారీ రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి శుభ్‌మన్ గిల్ ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రికార్డులే రికార్డులు 


ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేసి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 399 పరుగులు చేసింది. దీంతో ఇండోర్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టాటా నెక్సాన్ ఈవీ వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?


టాటా మోటార్స్ ఇటీవల తన నెక్సాన్ ఐసీఈ, ఈవీ లైనప్‌ను ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో పెద్ద మార్పులతో లాంచ్ చేసింది. కంపెనీ రెండు ఎస్‌యూవీల కోసం ఇప్పటికే బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది 465 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 


పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా అడ్డంకులు తొలగిపోయాయి. అందులోనూ ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, జనాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను చూడటం అలవాటు చేసుకున్నారు.. కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇతర భాషల చిత్రాల అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'RDX' (రాబర్ట్ డోని జేవియర్). మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం.. తాజాగా డిజిటల్ వేదిక మీదకు వచ్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి