Janasena leader Nagababu :
జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను ఇకనుంచి ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసి కొడతామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెట్టి పోటీ ఇవ్వనుందన్నారు. భవిష్యత్తులో టిడిపి, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుందన్నారు. కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించడం లేట్ అయిందని, జన సైనికులకు ఓ మోరల్ సపోర్ట్ ఇస్తున్నామని, గ్రౌంట్ లెవల్ లో ఇష్యూస్ పై చర్చించామని తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మా కార్యక్రమాలు చేస్తుంటే వైసీపి నాయకులు అడ్డుకుంటున్నారని, జనసేన నాయకులు కార్యక్రమాలు చేస్తే కేసులు పెడుతున్నారని చెప్పారు. జన సైనికులు ఏ కేసులకు భయపడరు అన్నారు. మాకు మంచి లీగల్ టీం వుంది మేము నేరుగా కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మా జనసైనికులు వైసీపి నాయకులు లాగా భూదందాలు చేయడం లేదని, వైసీపి దౌర్జన్యాలపై మేము న్యాయస్థానంలోనే తేల్చుకొంటాం అన్నారు. ఎవరు సీఎం కావాలన్నది కాకుండా ఎవరెవరి శక్తి తగ్గట్టుగా ఎన్నికల్లో పోటీ జరుగుతుందని, మాకు ప్రజా శ్రేయస్సే, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని ఆయన చెప్పారు. అందువలనే టిడిపీ మాకు సమానంగా వుందని, కాబట్టి మేము కలసి వెలుతాంమని ఆయన స్పష్టం చేశారు.
తమకు ఎక్కడ కూడా నాయకత్వం లోపం లేదని, ప్రజలను మోసం చేసే కార్యకర్తలు లేకపోవడం మా అదృష్టమన్నారు. అవకాశం, నీచమైన రాజకీయాలు జనసేన చేయదని, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారని ఒక సపోర్ట్ గా నిలబడ్డామని నాగబాబు అన్నారు. జనసేన ఉన్న కారణంగా చంద్రబాబు 99% ఆనందంగా ఉన్నారని చెప్పారు.. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని అంటే చెప్పు తీసి కొడతాంమని ఆయన హెచ్చరించారు. ఎక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో త్వరలోనే వెల్లడిస్తాంమని, మాకు అన్ని రకాలుగా వారాహి చాలా చాలా ముందుకు వెలుతోందని, కధాకలి ముందు ముందు ఉంటుదన్నారు.
జనసేన పార్టీ గట్టి పోటీ ఇస్తుందని నాగబాబు ధీమా..
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇస్తుందని, భవిష్యత్తులో జనసేన పార్టీ, టిడిపి కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కోట్లు కొల్లకొటి, దౌర్జన్యాలు చేసే నాయకులు మాకు లేక పోవడం మాకు చాలా మంచిదైందన్నారు. పవన్ కళ్యాణ్ పై గానీ జనసేన పార్టీపై గానీ విమర్శలు చేస్తే అదే విధంగా మేము సమాధానం చెప్తాం అన్నారు. అరాచక, నీచమైన రాజకీయాలు జనసేన చేయదని, మాకు భూ దందాలు చేసే నాయకులు మాకు అవసరం లేదని, రాయలసీమకు త్వరలోనే వారాహి (Pawan Kalyan Varahi Vehicle) చాలా స్ట్రాంగ్ గా వస్తుందని, ప్రజా సేవకులకు మాత్రమృ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు.