Shubman Gill Century: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది చాలా పరుగులు చేస్తున్నాడు. దీంతోపాటు ఎన్నో భారీ రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి శుభ్‌మన్ గిల్ ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు.


ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు వచ్చాయి. వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు ఇది ఆరో సెంచరీ. ఆస్ట్రేలియాపై తొలిసారిగా సెంచరీ సాధించాడు. వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు.


వన్డే క్రికెట్ చరిత్రలో 35 ఇన్నింగ్స్‌ల్లో 1,900 పరుగులు చేసిన ప్రపంచ తొలి బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ రికార్డు జాబితాలో అతను దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌లను దాటాడు.


వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు
శుభ్‌మన్ గిల్- 1917 పరుగులు
హషీమ్ ఆమ్లా- 1844 పరుగులు
బాబర్ ఆజం- 1758 పరుగులు
రాస్సీ వాన్ డెర్ డస్సెన్- 1679 పరుగులు
ఫఖర్ జమాన్- 1642 పరుగులు


ఈ ఏడాది ఐదో శతకం కొట్టిన శుభ్‌మన్ గిల్
ఈ ఏడాది శుభ్‌మన్ గిల్‌కి ఇది ఐదో సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించారు. కోహ్లి నాలుగుసార్లు, రోహిత్ మూడుసార్లు ఈ ఘనత సాధించారు. సచిన్ టెండూల్కర్ కూడా రెండుసార్లు దీన్ని సాధించాడు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial