Nexon EV Waiting Period: టాటా మోటార్స్ ఇటీవల తన నెక్సాన్ ఐసీఈ, ఈవీ లైనప్‌ను ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో పెద్ద మార్పులతో లాంచ్ చేసింది. కంపెనీ రెండు ఎస్‌యూవీల కోసం ఇప్పటికే బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది 465 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
రెండు వేరియంట్లలో లాంచ్
మునుపటి నెక్సాన్ ఈవీ ప్రైమ్‌ను ఇప్పుడు Nexon.ev MR (మిడ్ రేంజ్) అని పిలుస్తున్నారు. నెక్సాన్ ఈవీ మాక్స్‌ను ఇప్పుడు Nexon.ev LR (లాంగ్ రేంజ్) అని పిలుస్తున్నారు. Nexon.ev రెండు వేరియంట్‌లు మూడు ప్రధాన ట్రిమ్‌లలో లాంచ్ అయ్యాయి. వీటిలో క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ మోడల్స్ ఉన్నాయి. ఈ ట్రిమ్‌లు ఆప్షనల్ ప్యాకేజీలో కూడా మార్కెట్లోకి వచ్చాయి.
వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంది?
కొంతమంది డీలర్ల ప్రకారం కొత్త మోడల్ ధరను ప్రకటించిన తర్వాత Nexon.ev ప్రతి వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు 3-4 వారాల నుంచి 6-8 వారాలకు పెరిగింది. టాటా మోటార్స్ టాప్-స్పెక్ వేరియంట్‌ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నందున, ఎంట్రీ లెవల్ క్రియేటివ్+ MR, ఫియర్‌లెస్ ట్రిమ్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ చాలా నగరాల్లో దాదాపు 10 వారాల వరకు ఉంది.
ఫియర్‌లెస్+, ఫియర్‌లెస్+ ఎస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్‌తో సహా ఇతర వేరియంట్‌ల కోసం మ్యాగ్జిమం వెయిటింగ్ పీరియడ్ ఎనిమిది వారాలుగా ఉంది. డీలర్ల ప్రకారం Nexon.evలో ప్రిస్టీన్ వైట్, ఎంపవర్డ్ ఆక్సైడ్ అత్యధికంగా అమ్ముడవుతున్న కలర్ ఆప్షన్లు. దీని క్రియేటివ్ ప్లస్ వేరియంట్‌లకు చాలా వరకు 10 నుండి 12 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. కొత్త Nexon.ev ప్రధానంగా మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400, హ్యుందాయ్ కోనా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
టాటా ఉత్పత్తి చేస్తున్న కార్లలో నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. దీని సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఇదే. కంపెనీ కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్, కర్వ్ పెట్రోల్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఇంజన్‌ను కూడా అందించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్ కంటే మరింత శక్తివంతమైన, మెరుగైన మైలేజీని ఆశించవచ్చు. లోపలి వైపు చూసినట్లుయితే కొత్త నెక్సాన్ మోడల్ చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా కూడా ఉంది. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ ఈవీ దేశీయ మార్కెట్లో 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. నెక్సాన్, దాని వేరియంట్‌లు అన్నీ కలిపి దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial