Cars under 10 Lakh in India: దేశంలో తక్కువ ధర కలిగిన కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. రూ. 10 లక్షల లోపు అందుబాటు ధరలో త్వరలో మార్కెట్లోకి రాబోతున్న కొన్ని కొత్త కార్ల గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ మోటార్ తన కొత్త మైక్రో ఎస్‌యూవీని జూలై 10వ తేదీన భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండనుంది. ఇది EX, S, SX, SX(O), SX(O) అనే ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ కానుంది. దీనితో పాటు CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 10 లక్షల లోపే ఉంటుందని అంచనా. మీరు ఈ కారును రూ.11,000తో బుక్ చేసుకోవచ్చు.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆగష్టు 2023లో లాంచ్ కానుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఇంటీరియర్‌లలో చాలా అప్‌డేట్‌లను పొందనుంది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, అలాగే కొత్త 1.2-లీటర్ tGDi పెట్రోల్ ఇంజన్‌తో సహా చాలా కొత్త డిజైన్ ఎలిమెంట్‌లను ఈ SUVలో ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 125 బీహెచ్‌పీ పవర్, 225 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు ధర రూ. ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్
2024 ప్రారంభంలో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చాలా టెక్నాలజీ అప్‌డేట్స్‌ను చూడవచ్చు. దీంతో పాటు పలు ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులోకి రానున్నాయి. ఈ కారు ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్. 1.0 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతుంది.
కొత్త తరం హోండా అమేజ్
ఈ కారును 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది 1.2 లీటర్ ఐ-వీటెక్ ఇంజిన్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 90 bhp శక్తిని, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో కొత్త డిజైన్‌ను చూడవచ్చు. ఇందులో ADAS ఫీచర్‌నున కూడా అందించే అవకాశం ఉంది.
Read Also: అదిరిపోయే ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
టాటా పంచ్ సీఎన్‌జీ
ఆల్ట్రోజ్ తర్వాత ఇప్పుడు టాటా పంచ్ కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో రానుంది. ఇందులో 30 లీటర్ల డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 77 బీహెచ్‌పీ పవర్, 97 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌తో పాటు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండనుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!