Top 10 Headlines Today: 


కేసీఆర్‌ వ్యూహమేంటీ?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. మజ్లిస్ నేతృత్వంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు తనతో చర్చలు జరిపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని హామీ ఇవ్వడమే కాదు.. వారు ప్రగతి భవన్  దాటక ముందే ప్రకటన కూడా విడుదల చేశారు. యూసీసీ అనేది దేశాన్ని చీల్చడానికేనని స్పష్టం చేశారు. ఇది ఓ రకంగా రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మజ్లిస్ ఓ వైపు కాంగ్రెస్ కు దగ్గరవుతోందన్న ప్రచారం జరుగుతోంది. మరో వైవు బీజేపీకి..కేసీఆర్ కి మధ్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ చేసిన ప్రకటన... తెలంగాణ రాజకీయాల్లో ఓ మలుపు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ బయటకు మాట్లాడకపోవడం.. ప్రకటనలతో సరిపుచ్చడం మాత్రం ఇంకా ఇది నమ్మశక్యమేనా అన్న భావనలో కొంత మంది  ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పవన్ టార్గెట్ రీచ్ అయ్యారా?


ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలో భాగమయ్యారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకయ్యాయి. ఇందులో నిజానిజాలు ఎన్ని ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే.. ఒక్కసారిగా వాలంటీర్ల వ్యవహారంపై చర్చ ప్రారంభమయింది. వాలంటీర్లు ఎవరు ? వారి విధులేంటి ? ప్రజల వ్యక్తిగత డేటా వారి వద్ద ఎందుకు ఉంటోంది ? ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో వాలంటీర్లు  అనేక రకాల నేరాల్లో పాల్గొన్న ఘటనలకు సంబంధించిన వార్తలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ వాలంటీర్ల వ్యవహారాన్ని ప్రజల్లోకి చర్చ పెట్టాలనుకున్నారని అందుకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. పవన్ ఎందుకు వాలంటర్లను గురి పెట్టారు ? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సిట్ స్పీడ్


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టుల పర్యం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో 19 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న పోల రమేష్ నుంచి ప్రశ్న పత్రం కొనుగోలు చేసిన వారిని సిట్ అరెస్టు చేసింది. పరీక్షలో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్టు అయిన పోల రమేష్‌కు నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్‌ను 30 మందికి విక్రయించినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. పోల రమేష్ ఇచ్చిన సమాచారంతోనే తాజాగా మరో 19 మందిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 74కు చేరినట్లయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తీవ్ర విషాదం


ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్న బస్‌ కెనాల్‌లో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వరద బీభత్సం


రుతుపవనాల ప్రభావానికి తోడు పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన అలజడితో ఉత్తర భారత దేశాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఊళ్లు, నదులు ఏకమైపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఛండీగడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విధ్వంసం కొనసాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వర్షాలకు ఛాన్స్ 


ఈ రోజు ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి సగటు సముద్రమట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మంత్రికి బూట్లు తొడిగిన వ్యక్తి


సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ఆ విభాగం ఉద్యోగి బూట్లు తొడిగిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. దళిత క్రైస్తవ బిషప్ ల మొదటి కౌన్సిల్ సమావేశానికి మంత్రి మెరగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసేందుకు మంత్రి తన బూట్లను విడిచారు. తిరిగి వేసుకోవడం కష్టం కావడంతో అక్కడే ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మంత్రికి బూట్లు తొడగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


26 రాఫెల్, 3 స్కార్పెన్ క్లాస్ కొనుగోలు యోచనలో భారత్  


ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. ఈ వారం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వీటి కొనుగోలు ఒప్పంద వివరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించి.. ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందం జరిగితే భారత నావికాదళానికి 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ విమానాలు, 4 ట్రైనర్ విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ లు మిగ్ 29లను నడుపుతున్నాయి. దేశ భద్రత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను కొనాలని నౌకాదళం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆయనకు ఇచ్చేస్తే సరికదా


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత జట్టు  మరోసారి ఓడిపోవడంతో  రోహిత్ శర్మ  సారథ్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  పరిమిత ఓవర్లలో ఫర్వాలేదనిపిస్తున్నా టెస్టు క్రికెట్‌లో మాత్రం హిట్‌మ్యాన్ తన మార్కును చూపడం లేదు.  వయసు, ఫిట్‌నెస్ కూడా  రోహిత్‌కు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో  అతడిని  టెస్టు  సారథ్య బాధ్యతలను  యువ ఆటగాడైన శుభ్‌మన్ గిల్‌కు గానీ జట్టులో అనుభవజ్ఞుడైన  అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి.  అయితే టీమిండియా  మాజీ చీఫ్ సెలక్టర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం..  కెప్టెన్సీ పగ్గాలను తిరిగి కోహ్లీకే అప్పగించాలని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రొంబ ఇష్టం


క సినిమా విజయానికి పాటలు ఎంత దోహదం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిత్రమైనా ముందుగా జనాల్లోకి వెళ్ళేది సాంగ్స్ ద్వారానే. అందుకే ఫిలిం మేకర్స్ అంతా పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంటారు.. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ట్యూన్స్ రాబట్టగలగడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో పర భాషా సంగీత దర్శకుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్రెష్ నెస్ కోసమో, క్రేజ్ కోసమో లేదా తెలుగోళ్ళు బిజీగా ఉండటం వల్లనో తెలియదు కానీ.. మన దర్శక నిర్మాతలందరూ ఇప్పుడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ నుంచి అనిరుధ్ వరకూ చేతినిండా తెలుగు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రధానమంత్రి మోడీ ఎంతో ఇష్టపడే పండ్లు


ప్రధానమంత్రి మోడీ ఎంతో ఇష్టపడే పండ్లలో ఇక్కడ కనిపిస్తున్న పండ్లు కూడా ఒకటి. బెర్రీ పండ్లలా కనిపించే ఇవి కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఈ అడవి పండ్లను బేబెర్రీలు అని పిలుస్తారు. అలాగే కఫల్ అని కూడా అంటారు. ఇవి పర్వతాలపై మాత్రమే పండుతాయి. అది కూడా సీజనల్‌గా మాత్రమే దొరుకుతాయి. ఈ పండ్లను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి భారత ప్రధాని నరేంద్ర మోడీకి బుట్టలో నింపి బహుమతిగా అందజేశారు. ఈ పండ్లు ప్రధాన మోడీకి ఎంతో ఇష్టమైనవి.  బుట్టను అందుకున్నాక మోడీ ఈ పండ్ల తన లేఖలో రాశారు. ఉత్తరాఖండ్ సంస్కృతిలో 'కఫల్' పాతుకుపోయిందని, ఆ ప్రాంతంలోని జానపద పాటల్లో కూడా దీని ప్రస్తావన ఉందని లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.  వీటి ధర కిలో 300 రూపాయల వరకు ఉంటుంది. పర్యాటకులు ఎంతోమంది ఈ పండ్లను తినేందుకు ఇష్టపడతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి