Horoscope Today July 11, 2023


మేష రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పిల్లల చదువు విషయంలో సీరియస్ గా ఉంటారు. వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. మీ జీవన శైలిలో మార్పులొచ్చే అవకాశం ఉంది. సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.


వృషభ రాశి
ఈ రాశి వ్యాపారులు లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి వల్ల సమస్యలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి. అహంకారపూరిత ప్రవర్తన కారణంగా వ్యక్తులు మీ నుంచి దూరమవుతారు. మీ మనస్సులో ఏదో దిగులు ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఘర్షణకు దిగొద్దు


మిథున రాశి
ఈ రాశివారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. రాజకీయ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో కాలక్షేపం చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. 


కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి వ్యక్తిత్వం ప్రశంసలు అందుకుంటుంది. రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త స్టార్టప్‌లకు సంబంధించి ముఖ్యమైన పనులు చేయగలరు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు సీనియర్ల నుంచి సహాయం పొందుతారు.


సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


కన్యా రాశి
మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉన్నప్పుడే అనుకున్న పనులు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన పనులకోసం డబ్బు ఖర్చుచేస్తారు. ఎవరి నుంచీ పెద్దగా ఆశించకూడదు. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనసులో తెలియని భయం ఉంటుంది. బంధంలో ఏదో అసంపూర్ణ భావన ఉంటుంది.


Also Read: ఈ వారం ఈ రాశులవారు ఆర్థికవ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి!


తులా రాశి
ఈ రాశివారి ఆశయాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సులభం అవుతుంది. రుణాలు తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.


వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు బావుంటుంది. కష్టమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ స్వార్థం వల్ల మీకు చాలామంది దూరమయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యం విషయంలో  కొంత బలహీనత ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమం ఉండవచ్చు. భావోద్వేగానికి లోనై ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. స్నేహితుడికి అప్పు ఇవ్వవలసి రావచ్చు.


ధనుస్సు రాశి
ఈ రాశివారు భవిష్యత్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. అనుమానాస్పద స్వభావం ప్రేమ సంబంధాల్లో నష్టాన్ని కలిగిస్తుంది. అనుమానాస్పద స్వభావం ప్రేమ సంబంధాలలో నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ప్రజా కార్యక్రమాలలో పాల్గొంటారు.  భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ​​ఉంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి.


మకర రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. రాజకీయ వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుంది. మీ ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ చూపించాలి. 


Also Read: జూలై నుంచి అక్టోబరు వరకూ ఈ 4 రాశులవారికి మహారాజయోగం!


కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు బంధువులు, స్నేహితులతో సమావేశం అవుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు. మీ మనసులో కోరిక నెరవేరుతుంది. మీ ఆలోచనలను  మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. 


మీన రాశి
ఈ రాశివారు కొన్ని విషయాల్లో రాజీ పడవలసి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చిన్న అనారోగ్య సమస్య వేధిస్తుంది. సవాళ్లను స్వీకరించే ఉత్సాహం కలిగి ఉంటారు. ఆర్థిక సమస్యలు వచ్చినట్టే వచ్చి క్లియర్ అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.