Rahu Gochar 2023: శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఏప్రిల్ నుంచి మేష రాశిలో సంచరిస్తున్న రాహువు అక్టోబరు నెలాఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు. అక్టోబరు 28 న మీన రాశిలోకి వెళతాడు. అంటే దాదాపు నాలుగు నెలల పాటూ ఈ నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా రాహువు అంటే చెడు మాత్రమే చేసే గ్రహం అనుకుంటారు. అయితే రాహువు సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తుంది. మేష రాశిలో రాహువు సంచారం వల్ల లాభపడే ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి.
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
మేష రాశిలో రాహువు సంచారం కర్కాటక రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు లాభపడతారు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఐటీ రంగానికి చెందినవారు ప్రమోషన్ పొందుతారు. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం.
Also Read: శనివారం ఈ పరిహారాలతో శని దోషం తప్పకుండా తొలగిపోతుంది
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ రాశి 10వ ఇంట్లో రాహువున్నాడు. దీంతో అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్తితి వస్తుంది. ఉద్యోగులకు శుభసమయం. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత నియంత్రణ పాటించండి. ఉద్యోగులు వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ లక్ష్యాలను సాధిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఇల్లు కొనుగోలు దిశగా అడుగేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశివారికి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు.ఈ ప్రభావంతో ఉద్యోగం లేనివారు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మధ్యలోనే ఆపేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
Also Read: ఈ రాశివారు మాటిస్తే తప్పకుండా నెరవేర్చుతారు, జూలై 8 రాశిఫలాలు
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఈ రాశినుంచి రాహువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యాపారం విస్తరిస్తుంది. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగులు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాహువు సంచారం ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.