స్థూలకాయం లేదా అధిక బరువు అనేక అనారోగ్యాలు, ప్రమాదకరమైన వ్యాధులకు మూల కారణంగా ఉంటుందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా డబ్యూహెచ్ఓ అధ్యయనం ఊబకాయం వల్ల దాదాపు 18 రకాల క్యాన్సర్లని అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని వెల్లడిస్తోంది. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల పరాక్రమ అన్ని క్యాన్సర్లలో 4-8 శాతం స్థూలకాయానికి కారణమని చెప్పవచ్చు. మెనోపాజ్ తర్వాత వచ్చే రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, మూత్రపిండాలు, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్, కాలేయం, పిత్తాశయ క్యాన్సర్ లు ఊబకాయం ప్రధాన కారణం.
కొత్త అధ్యయనం ఏం చెప్తోంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం 18-4- సంవత్సరాల వయసులో ఉన్నలావుగా ఉన్న వారిలో 18 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయన ఫలితాల ప్రకారం స్పెయిన్ లోని కాటలోనియాలోని 2.6 మిలియన్లకి పైగా ప్రజల ఆరోగ్య రికార్డులని పరిశీలించారు. 2009 లో 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు. తొమ్మిదేళ్ల తర్వాత అంటే 2018 లో 2.25 లక్షల మందికి పైగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నివేదిక వెల్లడించింది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి బాడీ మాస్ ఇండెక్స్ పరిస్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు వారిని నిరంతరం పర్యవేక్షించారు. 25 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు 18 రకాల క్యాన్సర్లని అభివృద్ధి చేసే ప్రమాదం కలిగి ఉన్నట్టు తేలింది. బరువుతో ముడిపడి ఉన్న కొత్త క్యాన్సర్లలో లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా, తల, మెడ, మూత్రాశయ క్యాన్సర్లు ఉన్నాయి. అధిక బరువు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇక బాల్యంలోనె వచ్చి స్థూలకాయం వల్ల అభిజ్ఞా పనితీరు క్షీణించడం గుర్తించారు.
గతంలో స్థూలకాయంతో ముడిపడి ఉన్న క్యాన్సర్లు
☀మెదడు
☀థైరాయిడ్
☀అన్నవాహిక
☀రొమ్ము క్యాన్సర్
☀కాలేయం
☀పొట్ట
☀కిడ్నీ
☀పిత్తాశయం
☀ప్యాంక్రియాటిస్
☀పేగు
☀అండాశయం
☀గర్భాశయం
☀మైలోమా
క్యాన్సర్, ఊబకాయానికి సంబంధం ఏంటి?
ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ ప్రకారం విసెరల్ కొవ్వు శరీరంలోని ముఖ్యమైన అవయవాలను చుట్టుముట్టి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వినాశనం కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. విసెరల్ కొవ్వు కణాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి. కణాలు విభజన జరిగి కణితులు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల కణాల అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది. ఫలితంగా కణితి పెరుగుతుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలు రొమ్ము, ఎండోమెట్రియల్ , అండాశయ క్యాన్సర్లతో ముడి పడి ఉంది.
ఊబకాయాన్ని ఎదుర్కొనే మార్గాలు
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు బరువు అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం తగిన జాగ్రత్తలు అవసరం.
వ్యాయామం: సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వారానికి 150 నిమిషాల మితమైన ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ముఖ్యం.
ఒత్తిడి తగ్గించాలి: ఒత్తిడి శరీరం, మనసుపై భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల అధిక కేలరీల ఆహారం తినాలనే కోరికని కలిగిస్తుంది. ఊబకాయానికి దోహదపడుతుంది.
ఆరోగ్యవంతమైన ఆహారం: ప్లేట్ లో 2/3 భాగాన్ని పిండి లేని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు లేదా చిక్కుళ్ళు ఉండేలా చూసుకోవాలి. మిగిలిన 1/3 వంతు జంతు ప్రోటీన్ ఉండేలా తినాలి. అలాగే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇవి బరువుని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గాలన్నా, పెంచాలన్నా అది గుమ్మడి విత్తనాలకే సాధ్యం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial