Horoscope Today 2023 July 08th:  (జూలై 8 రాశిఫలాలు)


మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు కొత్త పనుల పట్ల జిజ్ఞాస ఉంటుంది.  జీవిత భాగస్వామి మీ భావాలను గౌరవిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిస్థితులు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటాయి. ప్రయాణానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలు కనిపిస్తాయి


వృషభ రాశి
ఈ రాశికి చెందిన ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుదుతారు. నూతన ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఓ శుభవార్త వింటారు. విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉంటారు.


మిధున రాశి
ఈ రాశివారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు షేర్ చేయొద్దు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సౌకర్యాలపై శ్రద్ధ వహించండి. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. జీవితంలో కొత్తదనం ఉంటుంది.


Also Read: ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు


కర్కాటక రాశి
ఈ రాశివారు ఏదైనా పని గురించి ప్రతిజ్ఞ చేస్తే దానిని కచ్చితంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఖర్చులు తగ్గడం వల్ల మనసు సంతృప్తి చెందుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది. జీవిత భాగస్వామితో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


సింహ రాశి
ఈ రాశివారు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. ఇంటి అవసరాలను పూర్తిచేస్తారు. మీరు మీ ఉద్యోగం పట్ల కొంచెం అసంతృప్తిగా ఉండవచ్చు. పని విషయంలో కాస్త సెన్సిటివ్‌గా ఉంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు.


కన్యా రాశి 
ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైనవారికి అనవసర వాగ్ధానాలు చేయవద్దు. మాట్లాడేటప్పుడు ఎదుటివారు హర్ట్ అయ్యేలా మాట్లాడకండి. కార్యాలయంలో రాజకీయాలుంటాయి జాగ్రత్త.  ఇంటికి అతిథుల రాక ఆకస్మికంగా ఉండవచ్చు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 


తులా రాశి
ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తారు. మీ ప్రతిభను పూర్తిగా వెలికితీయండి. కుటుంబ సభ్యుల మధ్య అనవసర అనుమానాలకు తావివ్వవద్దు. ఆనందకర వాతావరణం క్రియేట్ చేయడంలో మీ ప్రయత్నం మీరు చేయండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.


వృశ్చిక రాశి 
ఈ రోజు ఆ రాశికి చెందినవారు చేపట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. సౌకర్యాలను అనుభవిస్తారు. అత్యంత బాధ్యతాయుతమైన పనులను ముందుగా పూర్తి చేయండి. జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది...మాట తూలకండి. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. 


Also Read: కర్కాటక రాశిలో బుధుడి సంచారం - ఈ 5 రాశులవారికి అనుకూలం!


ధనుస్సు రాశి 
ధనస్సు రాశివారు మొండి ప్రవర్తన వీడాలి. వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించడం మంచిది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు


మకర రాశి
మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు. డబ్బును సక్రమంగా వినియోగించుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి  మాటపడాల్సిన సిట్యుయేషన్ రావొచ్చు..పని విషయంలో రాజీ పడకండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞులైన వారిని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండాలి.


కుంభ రాశి
మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి. తీసుకున్న అప్పులు చెల్లించడంలో కొంత ఒత్తిడికి లోనవుతారు.  ఆర్థిక పరిస్థితికి  కొంత అసంతృప్తినిస్తుంది. సన్నిహితుల ప్రవర్తన మిమ్మల్ని కలవరపెడుతుంది. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి.


మీన రాశి
ఈ రోజు మీరు పని సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ధనలాభం ఉంటుంది. సహోద్యోగుల ప్రవర్తన గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.